నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కండ్రిక సమీపంలో జాతీయ రహదారిపై గుర్తుతెలియని కారు ఆటోను ఢీ కొట్టింది. ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారంతా మర్రిపాడు మండలం పెగళ్లపాడు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో ఆటోలు మొత్తం 11 మంది ఉన్నట్లు తెలిసింది. డీసీపల్లిలో వరినాట్లకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణమైన కారు ఆపకుండా బద్వేలు వైపుగా దూసుకెళ్లింది.
ఇదీ చదవండి :