ETV Bharat / state

చెత్తతో నిండిన స్వర్ణాల చెరువు పార్క్‌ - నెల్లూరు బారాషాహీద్ స్వర్ణాల చెరువు పార్కు తాజా వార్తలు

స్వచ్ఛభారత్ పాటించండి అని ఎన్నిసార్లు చెబుతున్నా పెడచెవిన పెడుతున్నారు ప్రజలు. అధికారులూ దీనిపై ఎక్కువ చొరవ తీసుకోవడం లేదు. ఫలితంగా నెల్లూరులోని బారాషాహీద్ పార్క్ చెత్తా చెదారం, దోమలతో నిండిపోయింది.

చెత్తాచెదారంతో నిండిన పార్కు పరిసరాలు
author img

By

Published : Nov 9, 2019, 10:09 AM IST

Updated : Nov 9, 2019, 5:32 PM IST

ఎప్పుడూ ఆహ్లాదకరమైన వాతావరణం...చల్లని గాలి...స్వచ్ఛమైన నీరు ఉన్న చెరువు... వినడానికే ఎంతో బాగుంది కదా. నిన్నమొన్నటి దాకా ఆ పార్క్ అలాగే ఉండేది. ఇప్పుడు స్వచ్చతకు దూరంగా చెత్తా చెదారంతో దుర్గంధం వెదజల్లుతోంది నెల్లూరు జిల్లాలోని స్వర్ణాల చెరువు ఉద్యానవనం. ఈ ప్రాంతంలో దర్గా రొట్టెల పండుగ అతిపెద్దదిగా జరుపుకుంటారు. ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు మొక్కులు చెల్లించుకోవటానికి ఏడాది పొడవునా ఇక్కడకు వచ్చి బస చేస్తుంటారు. రాత్రి సమయాల్లో బస చేసేందుకు వస్తున్న పర్యటకులకు ఇక్కడి పరిస్థితులు తీవ్ర ఇబ్బందిగా మారాయి.

అతిపెద్ద రొట్టెల పండుగ
బారాషాహీద్ దర్గా రొట్టెల పండుగ అంటే దేశంలోని అనేక రాష్ట్రాల ప్రజలకు ఎంతో భక్తి విశ్వాసాలు ఉన్నాయి. కోట్లరూపాయలు ఖర్చు చేసి పుణ్య స్నానాలు ఆచరించేందుకు స్నానాల ఘాట్లు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేశాయి ప్రభుత్వాలు. ఇప్పుడు ఆ ప్రాంతమంతా చెత్తాచెదారంతో నిండిపోయు అధ్వాన్నంగా మారిపోయింది. అధికారులు కనీస పర్యవేక్షణ చేయడంలేదని స్థానికులు, పర్యటకులు వాపోతున్నారు.

పిల్లల కోసం ఏర్పాటు చేసిన పార్కులో పందులు...
చిన్నపిల్లల కోసం రెండేళ్ళ కిందట ఆటవస్తువులతో చక్కటి పార్కు ఏర్పాటు చేశారు. చిన్నపిల్లలు బదులు ఇప్పుడు కుక్కలు , పందులు, పిల్లులు స్వైర విహారం చేస్తున్నాయి. ఎప్పుడూ పచ్చగా ఉండే మొక్కలు ఎండిపోయాయి. రాత్రి సమయాల్లో కనీసం భద్రతా సిబ్బంది లేని దుస్థితి కనిపిస్తోంది. ఎక్కడిబడితే అక్కడ మద్యం బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. కుటుంబాలతో ఈ ప్రదేశానికి రావడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొన్నాయని స్థానిక మహిళలు అంటున్నారు.

చెరువులో దుర్వాసన
చెరువులో చేపలు చనిపోయి ఆ నీటితో దుర్వాసన వస్తుందని... దోమల బెడద ఎక్కువైందని స్థానికులు వాపోతున్నారు. రాత్రి సమయాల్లో లైట్లు పని చేయడంలేదని వారు తెలిపారు.

నగర పాలక సంస్థ అధికారులు బారాషాహీద్ స్వర్ణాల చెరువు పార్కు పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపరచాలని...తిరిగి పర్యటకులతో సందడిగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సందర్శకులు, స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చదవండి: చేపలచెరువులో విషప్రయోగం.. రూ.లక్ష నష్టం

sample description
Last Updated : Nov 9, 2019, 5:32 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.