నెల్లూరు జిల్లాలో ప్రతి ఎకరానికి నీరు అందిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరులోని గోల్డెన్ జూబ్లీ హాల్‌లో జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. జిల్లాలో 5లక్షల 60వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు తెలిపారు. రైతులకు నీరు ఇవ్వడం బాగానే ఉందని... జిల్లాలో ఎన్ఎల్ఆర్ 34449 రకం వరి విత్తన కొరత ఉందని సమావేశంలో పాల్గొన్న వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఫిర్యాదు చేశారు. దీనికి జిల్లా కలెక్టర్ శశిధర్ స్పందిస్తూ... జిల్లాలో విత్తన కొరత లేదని ఎన్ఎల్ఆర్ 34449 వరి రకమే సమస్య ఉందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి