పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుళ్ల గ్రామానికి చెందిన దంపతులు గోపీ, కృష్ణవేణి కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. స్థానికంగా పనులు లభించక పొట్టకూటి కోసం బెంగుళూరుకు బయలుదేరారు. ఈ నెల 5న తణుకులో శేషాద్రి ఎక్స్‌ప్రెస్ రైల్లో జనరల్ బోగీలో ఎక్కారు. అదే బోగీలో ఎక్కిన ఇద్దరు మహిళలు వీరితో మాటలు కలిపారు. మీ ముగ్గురు ఆడపిల్లల్లో ఒకరిని అమ్మండంటూ వారిని అడగడంతో ఆ తల్లిదండ్రులు కృష్ణవేణి, గోపీ అంగీకరించలేదు. ఇద్దరు పిల్లలు నిద్రపోవడంతో బోగీలోని సీట్ల మధ్యలో కింద పడుకోబెట్టారు. విజయవాడకు వచ్చాక రెండు నెలల పాపను కూడా వారి మధ్యే ఉంచారు. చీరతో ఉయ్యాల వేస్తే హాయిగా నిద్రపోతుందని ఆ ఇద్దరు మహిళలు సలహాతో గోపి రెండు సీట్లకు చీరతో ఉయ్యాల కట్టి పాపను అందులో పడుకోబెట్టారు. విజయవాడ నుంచి కావలి మధ్యలో గోపీ దంపతులు నిద్రలోకి జారుకున్నారు. కావలి రైల్వేస్టేషన్ దాటాక మెలకువ రాగా.. పసిపాపకు పాలిచ్చేందుకు ఉయ్యాలలో చూడగా లేకపోవడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. వీరిపక్కనే ఉన్న ఇద్దరు మహిళలు సైతం లేకపోవటంతో బోగీ మొత్తం వెతికారు. ఎక్కడా కానరాకపోవడంతో వారే బాలికను ఎత్తుకెళ్లినట్లు నిర్ధరణకు వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. నెల్లూరు రైల్వేస్టేషన్‌లో రైలు ఆగగానే దిగి ఆ ఇద్దరు మహిళల కోసం వెతికారు. అయినా కానరాకపోవటంతో నెల్లూరు పోలీసులను ఆశ్రయించారు. రైలు కావలి దాటాక పసిపాప లేని విషయాన్ని గుర్తించారని, అక్కడ ఏమైనా దిగారేమో పరిశీలించాలని కావలి రైల్వేస్టేషన్‌కు వారిని పంపించారు. వారి నుంచి ఫిర్యాదు తీసుకున్న పోలీసులు స్థానిక సీసీ ఫుటేజీలను పరిశీలించారు. ఓ మహిళ బేబిని తీసుకొని కావలి రైల్వేస్టేషన్‌లో దిగి అటోలో బస్టాండుకు వెళ్లినట్లు తెలుస్తోంది. రెండు నెలల పాపను దొంగలించిన మహిళ ఎవరు అనేదానిపై విచారిస్తున్నారు. పోలీసుల విచారణలో ఆటో డ్రైవర్ కొంత సమాచారం ఇచ్చారు. పాలు తాగే పసిబిడ్డ కిడ్నాపవ్వటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
పాప అదృశ్యం.... తల్లడిల్లుతున్న తల్లి హృదయం - కావలి రైల్వేస్టేషన్‌లో పాప కిడ్నాప్ వార్తలు
నెల్లూరు జిల్లా కావలి వద్ద రైళ్లో రెండు నెలల పాప కిడ్నాప్ కేసును పోలీసులు ఇంతవరకు ఛేదించలేదు. రెండు రోజులైన పాప ఆచూకీ లభ్యం కాకపోవటంతో తల్లి కృష్ణవేణి, తండ్రి గోపీ అల్లాడిపోతున్నారు. పాప కోసం కావలి-గూడూరు రైల్వే స్టేషన్లలో తిరుగుతూ క్షణం ఒక యుగంగా గడుపుతున్నారు. రెండో రోజు కూడా నిద్రలేకుండా పాపకోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
![పాప అదృశ్యం.... తల్లడిల్లుతున్న తల్లి హృదయం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4992869-752-4992869-1573134749738.jpg?imwidth=3840)