కర్నూలు జిల్లా కోడుమూరు మండలం రామాపురంలో అప్పుల బాధ భరించలేక విజయ్ కుమార్ అనే యువరైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్దిలేటి, శివమ్మలకు కుమారుడు విజయ్ కుమార్, కుమార్తె నాగలక్ష్మి సంతానం. విజయ్ కుమార్ డిగ్రీ వరకు చదువుకొని తండ్రికి ఆసరాగా ఉంటున్నాడు. మూడు సంవత్సరాల కిందట వారికి ఎనిమిది ఎకరాల పొలం ఉండేది. అప్పులు పెరగడంతో ఐదు ఎకరాలు అమ్ముకున్నారు. గత రెండేళ్లుగా తమకున్న మూడు ఎకరాల పొలంతో పాటు కౌలుకు తీసుకొని పత్తి జొన్న పంటలను సాగు చేశారు. పకృతి ప్రతాపంతో పంట దిగుబడి రాక అప్పులు పెరిగిపోయాయి.
అప్పుల బాధ భరించలేక యువరైతు ఆత్మహత్య - అప్పుల బాధ భరించలేక కర్నూలు జిల్లాలో యువరైతు ఆత్మహత్య
అప్పుల బాధ తట్టుకోలేక ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూలు జిల్లా కోడుమూరు మండలం రామాపురంలో జరిగింది.
![అప్పుల బాధ భరించలేక యువరైతు ఆత్మహత్య Suicide is unbearable](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5547558-991-5547558-1577775081625.jpg?imwidth=3840)
కర్నూలు జిల్లా కోడుమూరు మండలం రామాపురంలో అప్పుల బాధ భరించలేక విజయ్ కుమార్ అనే యువరైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మద్దిలేటి, శివమ్మలకు కుమారుడు విజయ్ కుమార్, కుమార్తె నాగలక్ష్మి సంతానం. విజయ్ కుమార్ డిగ్రీ వరకు చదువుకొని తండ్రికి ఆసరాగా ఉంటున్నాడు. మూడు సంవత్సరాల కిందట వారికి ఎనిమిది ఎకరాల పొలం ఉండేది. అప్పులు పెరగడంతో ఐదు ఎకరాలు అమ్ముకున్నారు. గత రెండేళ్లుగా తమకున్న మూడు ఎకరాల పొలంతో పాటు కౌలుకు తీసుకొని పత్తి జొన్న పంటలను సాగు చేశారు. పకృతి ప్రతాపంతో పంట దిగుబడి రాక అప్పులు పెరిగిపోయాయి.
రిపోర్టర్: రమేష్ బాబు, వాట్సాప్ నెంబర్:8008573776, కోడుమూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా.
శీర్షిక: అప్పుల బాధ తాళలేక యువరైతు ఆత్మహత్య
Body:కర్నూలు జిల్లా కోడుమూరు మండలం రామాపురంలో అప్పుల బాధ తాళలేక విజయ్ కుమార్ అనే యువరైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల, పోలీసుల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి .రైతు మద్దిలేటి, శివమ్మ లకు కుమారుడు విజయ్ కుమార్, కుమార్తె నాగలక్ష్మి సంతానం. విజయ్ కుమార్ డిగ్రీ వరకు చదువుకొని తండ్రికి ఆసరాగా ఉంటున్నాడు. మూడు సంవత్సరాల కిందట వారికి ఎనిమిది ఎకరాల పొలం ఉండేది అప్పులు పెరగడంతో ఐదు ఎకరాలను అమ్ముకున్నారు. గత రెండేళ్లుగా తమకున్న మూడు ఎకరాల పొలం తో పాటు కౌలుకు తీసుకొని పత్తి జొన్న పంటలను సాగు చేశారు. అతివృష్టి, అనావృష్టి కారణాలతో పంట దిగుబడి రాక అప్పులు పెరిగిపోయాయి.
Conclusion:అప్పులు పెరిగిపోవడంతో నిత్యం మనోవేదనకు గురైన రైతు మద్దిలేటి కుమారుడు విజయ్ కుమార్ ఆదివారం రాత్రి పురుగుల మందు తాగాడు. వాంతులు చేసుకుంటుండగా కుటుంబ సభ్యులు ఆరా తీశారు. పురుగుల మందు తాగినట్లు చెప్పడంతో వెంటనే తల్లిదండ్రులు విజయ్ కుమార్ చికిత్స నిమిత్తం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. కోలుకోలేక సోమవారం వేకువజామున మృతి చెందాడు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు కళ్ళముందే ప్రాణాలు వదిలాడు అంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. యువరైతు విజయకుమార్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ మల్లికార్జున బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
TAGGED:
Suicide is unbearable