ETV Bharat / state

ఈ గుంతల మీదుగా.. రాకపోకలెలా? - damage roads in malkapuram latest

కర్నూలు జిల్లా మల్కాపురంలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. గుంతలపై ప్రయాణాలు సాధ్యపడక... వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు.

road-problems-in-karnool-malkapuram
author img

By

Published : Oct 21, 2019, 5:26 PM IST

రోడ్లపై గుంతలతో ప్రజల అవస్థలు

కర్నులు జిల్లా డోన్‌ మండలం కమలాపురం నుంచి చిన్న మల్కాపురానికి వెళ్లాలంటే.. చాలా ఇబ్బందిగా మారింది. ఈ మార్గంలో ఉన్న గుంతలు.. పగలే చుక్కలు చూపిస్తున్నాయి. 4 కిలోమీటర్ల మేర రహదారి మొత్తం.. గుంతలమయంగా మారింది. చిన్నపాటి వర్షానికే జలమయమైంది. ఏ పనులకు వెళ్లాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు. వాహనాలు అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. సమీపంలో మైనింగ్‌ కారణంగా భారీ వాహనాలు తిరగుతున్నాయని.. అందుకే రోడ్లు పాడైపోతున్నాయని ఆరోపించారు. గతంలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన జరిగినా.. పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదన్నారు.

Intro:ap_knl_51_21_gunthala_rahadhari_ab_Pkg_RVOI_AP10055

s.sudhakar, dhone.

యాంకర్.

రోడ్లన్నీ నీ గుంతలు పడి అధ్వానంగా మారాయి. రోడ్డుపైన వెళ్లాలంటే నరకం కనబడుతుంది. చిన్నపాటి వర్షానికి గుంతల నిండా నీరు చేరి కుంటలను తలపిస్తున్నాయి.

వాయిస్ ఓవర్.

కర్నూలు జిల్లా డోన్ మండలం కమలాపురం గ్రామం నుండి చిన్న మల్కాపురం గ్రామం కు వెళ్లాలంటే చుక్కలు కనపడుతున్నాయి. ఐదు కిలోమీటర్ల మేర రోడ్లన్నీ గుంతల పడి జలమయం అయ్యాయి. కమలాపురం నుండి మల్కాపురం కు బ్యాంకుకు, ఇతర పనులకు వెళ్లాలంటే ఇటు పాదచారులకు అటు వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. గుంతల నిండా నీరు చేరడం వల్ల వాహనాలు అదుపుతప్పి కింద పడ్డామని గ్రామస్తులు ఆరోపించారు. ఈ రెండు గ్రామాలలో మైనింగ్ అధికంగా ఉండడం వలన ఈ రహదారిలో భారీ వాహనాలు తిరిగి రోడ్డు దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి 2019 ఫిబ్రవరి 22 వ తేదీన ఒక కోటి తొంబై ఐదు లక్షల రూపాయల వ్యయంతో గ్రానులర్ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఇంత వరకు పనులు మొదలు పెట్టలేదని వారు వాపోయారు. కమలాపురం నుండి చిన్న మల్కాపురం వరకు రహదారి వేయాలని వారు కోరుతున్నారు.

బైట్.

1.మధు
కమలాపురం.

2.రంగస్వామి
కమలాపురం.

Body:గుంతల రహదారి

Conclusion:kit no.692, cell no.9394450169
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.