ETV Bharat / state

ఉల్లి సాగు... రైతులకు మిగిలింది కన్నీళ్లే..! - కర్నూల్లో ఉల్లి సమస్యల వార్తలు

నారు నుంచి..పంట చేతికొచ్చి మార్కెట్​కు వెళ్లేదాకా రైతన్నకి కష్టాలే వెన్నంటే ఉంటాయి. ఆరుకాలం కష్టపడి పంటను అమ్ముకోవాలంటే...గిట్టుబాటు ధరలేక కర్షకులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. కర్నూల్లో అధిక వర్షాలతో ఉల్లి పంటలు పాడవ్వగా...మిగిలిన నాణ్యమైన ఉల్లికి సరైన ధరలేక రైతన్నలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది.

పోలాల్లో నిలవకుంచిన ఉల్లి
author img

By

Published : Nov 13, 2019, 3:28 PM IST

ఉల్లి మిగిల్చిన.. కన్నీళ్లు

సేద్యాన్ని నమ్ముకొని పనిచేసే రైతుకు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. అనావృష్టి, అతివృష్టితో రైతన్నలు అప్పుల్లో కూరుకుపోతున్నారు. కర్నూలు జిల్లాలో రైతులు వేల హెక్టార్లలో ఉల్లిని సాగు చేస్తున్నారు. ఈ ఏడాది రైతులు వేల ఎకరాలలో ఉల్లి నాటగా.... పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు వెంటాడాయి. అతివృష్టితో ఉల్లి దిగుబడి భారీగా పడిపోయింది. ఎకరాకు కేవలం 30 బస్తాలకు మాత్రమే పరిమితమైంది. నాణ్యమైన ఉల్లిని మార్కెట్ కి తీసుకెళ్లితే అక్కడ తమకు సరైన ధర లభించడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉల్లి చేతికందినా...చివరికు కన్నీళ్లే!
ఎకరా ఉల్లి సాగు చేసేందుకు నారు, దుక్కులు, మందులు, ఎరువులు, కూలీలకు కలిపి మొత్తం రూ.40 వేల దాకా ఖర్చు అవుతుందని రైతులు తెలిపారు. ఎకరాకు వంద బస్తాలు రావాల్సిన చోట కేవలం 20 నుంచి 30 బస్తాలు మాత్రమే దిగుబడి రావడంతో నష్టం వస్తోందని రైతులు వాపోతున్నారు. మార్కెట్లో క్వింటా ఉల్లి ధర రూ. 2 వేల నుంచి రూ . 2500 మించి రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్వింటాలుకు రూ. 5000 ధర కల్పించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఎక్కువ వర్షాలతో ఉల్లి దిగుబడి తగ్గిందని... మరోవైపు ధర లేకపోవడంతో తాము అన్ని విధాలా నష్టపోతున్నామన్నారు.

మద్దతు ధర కల్పించాలి...
ఎక్కువ వర్షాలతో ఉల్లి దిగుబడి తగ్గగా...మరోవైపు ధర లేకపోవడంతో రైతులు అన్నివిధాలా నష్టపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ తీసుకుని గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.

ఇదీచూడండి.ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు.. అమ్ముకోలేని స్థితిలో రైతన్న

Intro:ap_knl_111_12_kannillu_pettisthunna_ulli_pkg_ap10131
వాయిస్ ఓవర్ :రమేష్ బాబు,
యాంకర్ బైట్స్
రిపోర్టర్: రమేష్ బాబు, వాట్సాప్ నెంబర్:8008573776, నియోజకవర్గం కర్నూలు జిల్లా.
శీర్షిక: కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి.

Body:సేద్యాన్ని నమ్ముకొని పనిచేసే రైతుకు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. అనావృష్టి అతివృష్టి తో రైతన్నలు అప్పుల్లో కూరుకు పోతున్నారు . కర్నూలు జిల్లాలో సాధారణం గా ఉల్లిని వేల హెక్టార్లలో సాగు చేస్తారు . ఈ ఏడాది రైతులు అదే బాట పట్టారు. వేల ఎకరాలలో ఉల్లి నాటారు. పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు వెంటాడాయి. అతివృష్టి తో ఉల్లి దిగుబడి భారీగా తగ్గిపోయింది. ఎకరాకు కేవలం 30 బస్తాల కు మాత్రమే పరిమితమైంది అంటూ ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దెబ్బతిన్న ఉల్లిని పొలాల్లోనే వదిలేసి నాణ్యమైన ఉల్లి మార్కెట్ తీసుకెళితే అక్కడ తమకు సరైన మార్కెట్ ధర లభించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు

Conclusion:ఎకరా ఉల్లి సాగు చేసేందుకు ఉల్లి నారుకు, దుక్కులకు, మందులకు, ఎరువులకు, కూలీలకు కలిపి మొత్తం 40 వేల దాకా ఖర్చు వస్తుందని రైతులు తెలిపారు .ఎకరాకు వంద బస్తాలు రావాల్సిన చోట కేవలం 20 నుంచి 30 బస్తాలు మాత్రమే పంట దిగుబడి రావడంతో నష్టం వస్తుంది అంటూ వారు తెలిపారు. మార్కెట్లో క్వింటన్ రూ. క్వింటాలు ఉల్లి ధర రూ. 2 వేల నుంచి రూ . 2500 మించి పోవటంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కింటాలు రూ. 5000 కల్పిస్తే తప్ప తమకు ప్రయోజనం లేదని చివరి రైతు వరకు న్యాయం చేయాలని వారు కోరారు. ఎక్కువ వర్షాలతో ఉల్లి దిగుబడి తగ్గిందని మరోవైపు ధర లేకపోవడంతో తాము అన్నివిధాలా నష్టపోతున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.