కర్నూలు జిల్లా నంద్యాలలో ఆదర్శ పాఠశాల ఆలస్యంగా మంజూరయింది. 2015లో ఈ పాఠశాల ఏర్పాటుకు ప్రభుత్వం అయిదు కోట్ల రూపాయలను కేటాయించింది. నూతన భవన నిర్మాణానికి స్థలాన్వేషణ జరిగింది. నంద్యాల పట్టణ పరిధిలోని ప్రభుత్వ స్థలం లభించడం గగనమైంది. చివరికి పట్టు పరిశ్రమ శాఖ కార్యాలయంలో తాత్కాలికంగా పాఠశాల కొనసాగిస్తున్నారు. అక్కడా సరైన సౌకర్యాలు లేని కారణంగా.. పిల్లలు సమస్యలను ఎదుర్కొంటున్నారు.
గత కొన్నేళ్ల క్రితం నిర్మించిన పట్టు పరిశ్రమ భవనం శిథిలావస్థకు చేరుకుంది. అది పాఠశాలకు అనుకూలంగా లేకపోవడం వల్ల చెట్ల కిందే బోధన సాగుతోంది. వర్షం వస్తే పాఠశాలకు సెలవే. ఈ తాత్కాలిక భవనంలో ఆటస్థలం.... మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు లేవు. ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తూ.. త్వరగా శాశ్వత భవనం ఏర్పాటు చేయాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ఇదీ చదవండి