తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు బోటు ప్రమాదంలో మృతి చెందిన కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన ఎనిమిదేళ్ల విఖ్యాతరెడ్డి మృతదేహం ఇప్పటికీ లభ్యంకాలేదు. ఇదే ప్రమాదంలో బాలుడి తల్లిదండ్రులు మహేశ్వరరెడ్డి, స్వాతితో పాటు సోదరి హసిక మృతిచెందారు. వారి మృతదేహాలు గత నెలలోనే లభ్యమయ్యాయి. మంగళవారం ఒడ్డుకు చేరిన బోటులోనూ విఖ్యాతరెడ్డి మృతదేహం దొరకలేదు. మరోవైపు ప్రమాదంలో గల్లంతైన కృష్ణా జిల్లా తాళ్లమూడికి చెందిన నడుకుదురు శ్రీనివాసరావు ఆచూకీ సైతం ఇంతవరకు లభ్యం కాలేదు. శ్రీనివాస్ తండ్రి ఏడాది క్రితం హృద్రోగంతో మృతిచెందగా... తల్లి కూడా అనారోగ్యంతో బాధపడుతోంది. శ్రీనివాస్ బోటు నుంచి చివరి సారిగా పంపిన వీడియోలు చూస్తూ అతడి మిత్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఇవీ చదవండి