రాజధాని అమరావతి ఒక స్కాం అని కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ ఎద్దేవా చేశారు. అమరావతిలోని మూడు గ్రామాల ప్రజల కోసం రాష్ట్ర ప్రజలందరికీ అన్యాయం చేయాల్సిన అవసరం ముఖ్యమంత్రికి లేదన్నారు. ఒకప్పుడు కర్నూలులో రాజధాని కోసం త్యాగం చేసిన ప్రజలు రోడ్లపైకి రాలేదన్నారు. ఇప్పుడు మాత్రం డ్రామా కంపెనీ ఆర్టిస్టులతో నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. వీరి ఆందోళనకు ప్రజల మద్దతు లేదన్నారు. ప్రతి జిల్లాకు న్యాయం జరుగుతుందని.. అమరావతిలోని మూడు గ్రామాల ప్రజలు ముఖ్యమంత్రి జగన్ను విమర్శించినా ఆయన న్యాయం చేస్తారని చెప్పారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికను స్వాగతిస్తున్నామని తెలిపారు.
ఇదీ చూడండి: