ప్రకాశం జిల్లాకి చెందిన కొంతమంది ఓ బృందంగా ఏర్పడి... చైతన్య జ్యోతి ఫ్రెండ్స్ సర్కిల్ పేరుతో ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. గత పదేళ్లుగా ఎంతోమంది అభ్యాగ్యులకు ఈ బృందం ఎన్నో సేవలందిస్తోంది.
ఎలా మెుదలైందంటే...
కర్నూలు పట్టణంలో వరదల కారణంగా చాలామంది సర్వం కోల్పోయారు. బాధితుల ఇబ్బందులను చూసిన ఈ స్నేహితులంతా... ఓ బృందంగా ఏర్పడి... వారికి చేయూతనివ్వాలని సంకల్పించారు. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టారు. చైతన్య జ్యోతి ఫ్రెండ్స్ సర్కిల్ పేరుతో ఒక ఫౌండేషన్ను ఏర్పాటు చేశారు. ఎవరికి వారు తోచినంత చందాలు వేసుకొని.. అగ్నిప్రమాద బాధితులు, మానసిక రోగులు, వృద్ధులు, దివ్యాంగులకు నిత్యావసర, నగదు, దుస్తులు, దుప్పట్లు, విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్లు, పేద ఆడపడుచులకు మంగళ సూత్రాలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సాయం ఇలా అవసరమైన వారందరికీ చేయుతనిస్తున్నారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా... విద్య, వైద్య, ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే తమ దృష్టికి తీసుకువస్తే ఆదుకుంటామని చెబుతున్నారు. వీరి సేవలు మరింత విస్తరించి... మరింత మందికి చేయూతనివ్వాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.
ఇవీ చదవండి