కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో బీఈడీ కళాశాల నడుపుతున్న శ్రీనివాసులు అతని మిత్ర బృందం అనాథల పాలిట శరణార్థుల్లా మారింది. అనాథలు ఎక్కడ కనిపించినా వారికి సపర్యలు చేస్తున్నారు. ఆస్పత్రులు, బస్టాండ్లల్లో దిక్కు లేని వారికి అన్నీ తామే అయి చూసుకుంటారు. ఒక వేళ అనాథలు చనిపోతే పోలీసులకు సమాచారమిచ్చి వారి అంత్యక్రియలను దగ్గరుండి జరిపిస్తున్నారు. మరణించిన వారి మతం తెలిస్తే ఆ సంప్రదాయం ప్రకారమే తంతు జరుపుతారు. ఇప్పటివరకూ 60 అనాథ మృతదేహాలకు అంత్యక్రియలు జరిపినట్లు బృంద సభ్యులు తెలిపారు.
ఇదీ చూడండి