కర్నూలు జిల్లాలో ఈనాడు స్పోర్ట్స్ లీగ్ క్రికెట్ పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. నగరంలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ మైదానం, వైద్యకళాశాల మైదానంలో ఎనిమిదవ రోజు సీనియర్స్ విభాగంలో పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో శ్రీసాయికృష్ణ డిగ్రీ కళాశాల, జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల, ఉస్మానియా డిగ్రీ కళాశాల, డాక్టర్ జ్యోతిర్మయి డిగ్రీ కళాశాల, ఎస్టీబీసీ కళాశాల, కేవీఎస్ఆర్ డిగ్రీ కళాశాల జట్లు విజయం సాధించాయి.
ఇదీ చదవండి: ప్రతిభ కనబరుస్తున్న యువ క్రికెటర్లు