శాంతిభద్రతల వైఫల్యాలే వైకాపా సర్కార్ పతనానికి నాంది పలుకుతాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హెచ్చరించారు. రోజులు ఎప్పుడూ ఒకేళా ఉండబోవన్న ఆయన... తెదేపా తిరగబడితే తట్టుకోలేరని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ తన మానవత్వాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపాలని హితవు పలికారు.
కర్నూలు జిల్లా తెలుగుదేశం విస్తృతస్థాయి సమావేశంలో భాగంగా...చంద్రబాబు రెండోరోజు ఆళ్లగడ్డ,నందికొట్కూరు, కోడుమూరు, ఆలూరు, పత్తికొండ, నంద్యాల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. క్షేత్రస్థాయిలో ఇబ్బందులను అడిగితెలుసుకున్నారు. వైకాపా బాధిత కుటుంబాలతో ముఖాముఖి మాట్లాడారు. రాజకీయ వేధింపులను..వారి మాటల్లోనే విన్న చంద్రబాబు.. పార్టీ తరఫున అండగా ఉంటామని.. అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు.
వైకాపా బాధితుల ఆవేదనకు... .. ప్రభుత్వం సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని వేధించడం సరికాదని హితవు పలికారు.
మూడోరోజు పర్యటనలో భాగంగా బనగానపల్లి, పాణ్యం, శ్రీశైలం, కర్నూలు నియోజకవర్గ కార్యకర్తలతో నేడు చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.
ఇదీచదవండి