కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని అమ్మవారి శాలలో బొగ్గరపువారి ఆత్మీయా సమ్మేళనం జరిగింది. డోన్ మండలం ఓబుళాపురం గ్రామానికి చెందిన బొగ్గరపు కేశువయ్య కుటుంబం మెగా సమ్మేళనం నిర్వహించారు. ఈ వంశానికి చెందిన దాదాపు 60 కుటుంబాలు ఈ సమ్మేళనంలో పాల్గొన్నాయి. ఇక్కడ పుట్టి తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, పుణే, బెంగళూరు రాష్ట్రాలలో ఉద్యోగరీత్యా స్థిర పడ్డారని మురళీధర్ గుప్తా తెలిపారు. ఇతర దేశాలలో ఉన్న వారు ఈ సమ్మేళనానికి రాలేకపోయారు. సమ్మేళనానికి హాజరైన వారు ఒకరిని ఒకరు పరిచయం చేసుకున్నారు. ఇలా ఒకే వంశానికి చెందిన వారు కలవడం డోన్‌లో ఇదే ప్రథమమని, చాలా సంతోషంగా ఉందని బొగ్గరపు వంశస్థులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి...