ETV Bharat / state

'రాష్ట్రంలో హిట్లర్ పాలన సాగుతోంది'

రాష్ట్రంలో హిట్లర్ పాలన నడుస్తోందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విమర్శించారు. కర్నూలులో మాట్లాడిన ఆమె ప్రభుత్వ వైఖరిని దుయ్యబట్టారు.

bhuma akhilapriya commets on ycp
మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ
author img

By

Published : Jan 8, 2020, 12:37 AM IST

రాష్ట్రంలో హిట్లర్ పాలన నడుస్తోందని మాజీ మంత్రి తెదేపా నేత భూమా అఖిలప్రియ విమర్శించారు. ఆళ్లగడ్డలోని తన నివాసంలో ఆమె విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంటే వైకాపా నాయకులు ప్రశాంతంగా ఉన్నారని మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందన్నారు. అమరావతి మార్పుతో రాజధాని రైతులు చేసిన త్యాగాలు వృధా అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. లోకేశ్​ను పోలీసులు అరెస్ట్ చేయటం దారుణమన్నారు. వైకాపాకు ఎందుకు ఓటు వేశామని ప్రజలు నేడు తలలు పట్టుకుంటున్నారన్నారు. అమరావతిలో రైతుల కష్టాలు చూసి రాయలసీమలోని రైతులు కూడా చలించి పోతున్నారని అఖిలప్రియ వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి

రాజధాని వ్యధ.. మహిళా రైతు మృతి

Intro:ap_knl_101_07_ex_minister_akhila_press_meet_ab_ap10054 రాష్ట్రంలో హిట్లర్ పాలన రాష్ట్రంలో హిట్లర్ పాలన నడుస్తోందని రాష్ట్ర మాజీ మంత్రి తెదేపా నేత భూమా అఖిలప్రియ విమర్శించారు మంగళవారం ఆళ్లగడ్డ లోని తన నివాసంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు రాష్ట్రం అల్లకల్లోలం గా ఉంటే వైకాపా నాయకులు ప్రశాంతంగా ఉన్నారన్నారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ప్రజలు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావన్నారు అమరావతి మార్పుతో రాజధాని రైతులు చేసిన త్యాగాలు వృధా అవుతాయి అన్నారు గత 15 రోజులుగా మహిళలు పిల్లలతో సహా రోడ్లపైకి వచ్చి రైతులు నిరసన వ్యక్తం చేస్తుంటే వారికి మద్దతుగా వెళ్లిన తమ నేత లోకేష్ ను పోలీసులు అరెస్ట్ చేయటం దారుణమన్నారు ఈ ప్రభుత్వ పాలన చూస్తుంటే ఆనాటి హిట్లర్ పాలనను తలపిస్తోంది అన్నారు వైకాపాకు ఎందుకు ఓటు వేశామని ప్రజలు నేడు తలలు పట్టుకుంటున్నారు ఆనాడు పాదయాత్ర లోప్రజల కష్టాలు తెలుసుకున్నానని రాష్ట్రంలో కష్టాలు లేకుండా చేస్తానంటూ వాగ్దానాలు చేసి అధికారంలో వచ్చిన ముఖ్యమంత్రి నేడు ప్రజల మధ్య కి వచ్చేందుకు భయపడి పోతున్నారు అని మాజీ మంత్రి విమర్శించారు వైకాపా మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు ప్రజలను ఎప్పుడో మర్చిపోయారు అన్నారు అమరావతిలో రైతుల కష్టాలు చూసి రాయలసీమలోని రైతులు కూడా చలించి పోతున్నారని మాజీ మంత్రి అన్నారు

Body:రాష్ట్ర హిట్లర్ పాలన నడుస్తోందని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విమర్శలు

Conclusion:రాష్ట్రంలో హిట్లర్ పాలన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.