ETV Bharat / state

సచివాలయ ఉద్యోగాల భర్తీలో మరో జాబితా రానుందా? - గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీ

రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగాలు భారీగా మిగిలిపోయాయి. ధ్రువ పత్రాల పరిశీలన పూర్తయ్యే సరికి 25 వేలకు పైగా పోస్టులు భర్తీ కాకుండా నిలిచిపోయాయి. ఖాళీ పోస్టుల భర్తీపై ఎలా ముందుకు వెళ్లాలనే విషయమై పంచాయతీరాజ్ శాఖ తర్జన భర్జన పడుతోంది. సీఎం ఆదేశాలమేరకు తదుపరి చర్యలు తీసుకోనుంది. పోస్టుల భర్తీపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయమై నిరుద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది.

సచివాలయం
author img

By

Published : Oct 12, 2019, 6:20 AM IST

రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ కేటగిరిలో లక్షా 26 వేల 728 పోస్టుల భర్తీకి ఇటీవలే వైకాపా సర్కార్ నియామక ప్రక్రియ చేపట్టింది. ఎంపికైన వారంతా ఇప్పటికే ఆయా పోస్టుల్లో చేరారు. అయితే నియామక ప్రక్రియ ముగియటంతో మిగిలిపోయిన పోస్టులపై పంచాయతీరాజ్ శాఖ నివేదిక తయారు చేస్తోంది. ప్రాథమిక సమాచారం మేరకు రాష్ట్రంలో అన్ని పోస్టులు కలిపి 25 వేల 287 పోస్టులు మిగిలి పోయాయి.

జిల్లా ఖాళీలు
చిత్తూరు 3,384
తూర్పు గోదావరి 2,694
విశాఖపట్నం 2,307
అనంతపురం 2,158
పశ్చిమ గోదావరి 2,012
కర్నూలు 1939
నెల్లూరు 1911
కృష్ణా 1966
శ్రీకాకుళం 1865
విజయనగరం 1664
కడప 1599

మిగిలిపోయిన 25 వేలకు పైగా ఖాళీలకు అదనంగా మరికొన్నిపోస్టులు చేరే అవకాశాలున్నాయి. ఇవన్నీ కలిపితే ఖాళీల సంఖ్య 30 వేల వరకు చేరుతుందని అంచనా. ఈ పోస్టులను ఎలా భర్తీచేయాలనే విషయమై అధికారులు ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. అర్హులైన అభ్యర్థులు లేనందున వివిధ కేటగిరీలకు సంబంధించిన పరీక్షల్లో వచ్చిన అర్హత మార్కులను తగ్గిస్తే తప్ప భర్తీ చేపట్టటం సాధ్యం కాదని అధికార వర్గాలంటున్నాయి. అర్హత మార్కుల తగ్గింపు అంశం ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇకపై ఏటా జనవరిలో ఉద్యోగ నియామకాలు చేపడతామని సీఎం జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ మేరకు గ్రామ సచివాలయ పోస్టులను జనవరిలో తిరిగి నోటిఫికేషన్ జారీచేసి భర్తీ చేస్తారా లేక అర్హత మార్కులు తగ్గించటం ద్వారా ఇప్పుడే భర్తీ చేస్తారా అనేది ప్రభుత్వం తేల్చాల్సి ఉంది. ఈ విషయంలో సీఎం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది. కటాఫ్ మార్కులు తగ్గింపుపై చాలా మంది ఆశలుపెట్టుకున్నారు. ఇప్పటికే ఎంపికైన అభ్యర్థులు ఈనెల 14 లోపు తప్పక విధుల్లో చేరాలి. ఆరోజు వరకు చూసి ఖాళీల తుది జాబితా సిద్దం చేస్తారు. ఈ నెల 15 తర్వాతే పోస్టుల భర్తీపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

Intro:ap_cdp_41_11_178 kotla_billulu_pending_avb_ap10041
place: proddatur
reporter: madhusudhan

గ్రామాల అభివృద్ధి కోసం ఉపాధి హామీ పనులు చేసిన వ్యక్తులు తీవ్రంగా నష్టపోయారని కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి అన్నారు. జిల్లాకు 178 కోట్ల రూపాయల ఉపాధిహామీ బిల్లులు రావాల్సి ఉందని ప్రొద్దుటూరులో ఆయన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు. ప్రభుత్వం కేవలం పులివెందుల కు మాత్రమే ఉపాధి హామీ బిల్లులకు సంబంధించిన డబ్బులు ఖాతాల్లో చేశారన్నారు. నిధులు తక్కువ ఉంటే స్పష్టమైన హామీ ఇచ్చి అందరికీ చెల్లించాల్సిందే పోయి ఒక్క పులివెందులకు మాత్రమే డబ్బులు ఇవ్వడం బాధాకరమన్నారు. ప్రొద్దుటూరులో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోందన్న ఆయన ఎగ్జిబిషన్లో ప్రవేశ రుసుము 20 రూపాయలు తీసుకోవాల్సి ఉండగా అరవై రూపాయలు వసూలు చేస్తూ దోపిడీ చేస్తున్నారని వాపోయారు వీటిని అరికట్టాలని డిమాండ్ చేశారు.

Body:a

Conclusion:a
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.