ETV Bharat / state

వైరల్.. మైనర్ ప్రేమికులపై గ్రామపెద్ద జులుం - village head

ప్రేమించుకున్నారన్న కారణంగా ఇద్దరు మైనర్లను గ్రామపెద్దలు విచక్షణారహితంగా కొట్టారు. అనంతపురం జిల్లా కేపీ దొడ్డి గ్రామంలో జరిగిన ఈ ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.

వైరల్ : మైనర్ ప్రేమికులపై గ్రామపెద్ద జులూం
author img

By

Published : Aug 16, 2019, 8:55 PM IST

వైరల్ : మైనర్ ప్రేమికులపై గ్రామపెద్ద జులూం
కంప్యూటర్ యుగంలోనూ మూఢ నమ్మకాలు ఏ మాత్రం తగ్గడం లేదు. చేతబడి, బాణామతి, కులాచారం, గ్రామ కట్టుబాట్లు అంటూ విపరీత ధోరణితో ప్రవర్తిస్తున్నారు. అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం కేపీ దొడ్డి గ్రామంలో...ప్రేమించుకున్నారన్న కారణంగా ఇద్దరు దళిత మైనర్లను పంచాయతీకి పిలిపించి విచక్షణారహితంగా దాడి చేశారు. కర్రలతో కొడుతూ.. కాలితో తన్నుతూ బహిరంగ శిక్ష వేశారు. గ్రామం మొత్తం చూస్తుండగా ఇద్దరు మైనర్లను విపరీతంగా కొట్టారు. కొంతమంది గ్రామస్థులు పంచాయతీ పెద్దల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన.. వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.

ఇదీ చదవండి :

'పార్టీలో ఇబ్బందులుంటే చెప్పండి.. అంతేకానీ'

Intro:అనంతపురం జిల్లా ధర్మవరంలో విద్యుత్ ఘాతానికి గురై భవన నిర్మాణ కార్మికుడు వినోద్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు పట్టణంలోని లక్ష్మీ చెన్నకేశవ పురం కాలనీ లో భవన నిర్మాణ పనులు చేస్తున్న వినోద్ కుమార్ ఇనుప చువ్వ ను పక్కకు పెడుతుండగా ఇంటి పై భాగంలో ఉన్న విద్యుత్ తీగలు తగిలాయి విద్యుత్ ప్రమాదానికి గురైన వినోద్ కుమార్ ను చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

Body:విద్యుత్ ఘాతం

Conclusion:అనంతపురం జిల్లా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.