కృష్ణా జిల్లా నూజివీడు రెవెన్యూ డివిజన్లోని విస్సన్నపేట వెలుగు కార్యాలయంలో సీసీగా విధులు నిర్వహిస్తున్న మారేశ్వరరావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఉన్నతాధికారుల అవినీతి వేధింపులకు తాళలేక ఆత్మహత్యకు యత్నించినట్లు బాధితుడు పేర్కొన్నాడు. ఏపీఎం రాజారావు, ఏసీ నిత్యం డబ్బులు కావాలంటూ వేధిస్తున్నారని వాపోయాడు. డ్వాక్రా గ్రూప్‌లకు సంబంధించిన సీఐఎఫ్, స్త్రీ నిధి నగదును వీరి సొంత ఖాతాలకు మలచుకోవడం, ఇల్లు మరమ్మతులు చేయించుకోవడం, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారని మారేశ్వరరావు తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానికులు మారేశ్వరరావును నూజివీడు ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: ఉల్లి కోసం వచ్చి.. గుండెపోటుతో వ్యక్తి మృతి