ప్రభుత్వం అవినీతిపై ఫిర్యాదు చేయటానికి 14400 టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నెంబర్కు తెదేపా సీనియర్ నేత... వర్లరామయ్య ఫోన్ చేశారు. జగన్ అక్రమార్జనపై అధ్యయనం చేయాలని ఫిర్యాదు చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.43వేల కోట్లు సంపాదించారని ఆరోపించిన వర్లరామయ్య... రాజకీయ అవినీతిపై అధ్యయనం చేయాలని డిమాండ్ చేశారు.
ఫిర్యాదును సచివాలయం తీసుకెళ్లి ఇవ్వాలని కాల్ సెంటర్ సిబ్బందికి సూచించారు. సీఎం ప్రకటించినట్లుగా తన ఫిర్యాదు పైనా 15రోజుల్లో చర్యలు తీసుకోవాలన్నారు. తనపై అభియోగాలు పెట్టుకొని అవినీతిని అంతమొందిస్తానని జగన్ ఎలా చెప్తారని ప్రశ్నించారు. తనపై తానే అధ్యయనం చేయించుకుంటానని సీఎం స్వచ్ఛందంగా ముందుకు రావాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి