మహిళల రక్షణ కోసం టోల్ ఫ్రీ నెంబర్లు ఉన్నాయని విజయవాడ తూర్పు ఏసీపీ చంద్రశేఖర్ వివరించారు. కృష్ణా జిల్లా గన్నవరం పీఎస్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేస్తే... మూడు నుంచి ఐదు నిమిషాల లోపు సంబంధిత ప్రాంతానికి పోలీసులు చేరుకుంటారని తెలిపారు. దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. ప్రత్యేకంగా దూరప్రాంతాలకు వెళ్లే మహిళలు విద్యార్థులు టోల్ ఫ్రీ నెంబర్ తెలుసుకోవాలని సూచించారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన వైద్యురాలి హత్య అందరిని కలిచివేసిందని చెప్పారు. పోలీసు శాఖ మహిళలకు ఎప్పుడూ తోడుగా ఉంటుందని తెలిపారు.
ఇదీ చూడండి: పదహారేళ్ల బాలికపై ఆరుగురి సామూహిక హత్యాచారం