కృష్ణాజిల్లా తిరువూరు మండలం లక్ష్మీపురం బస్‌స్టాప్‌లో కొద్ది రోజుల ముందు జీవచ్ఛవంలా పడి ఉన్న వృద్ధుడు వేముల రామ నరసింహం మరణించాడు. దీనస్థితిలో ఉన్న అతని గురించి ఈనాడు-ఈటీవీ కథనాల రూపంలో వెలుగులోకి తెచ్చింది. పోలీసుల ఒత్తిడితో రామ నరసింహం కుమార్తె అతన్ని ఇంటికి తీసుకెళ్లింది. అయితే తన సోదరుడు తన తండ్రిని చూడడం లేదని ఆమె రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కుమారున్ని చరవాణిలో సంప్రదించగా స్పందన లేదు. గురువారం రామ నరసింహం తుది శ్వాస విడిచాడు. వృద్ధుడు చనిపోవడంపై కుటుంబ సభ్యులు కనీసం పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేదు. గుట్టుచప్పుడు కాకుండా తిరువూరులో అంత్యక్రియలు పూర్తి చేశారు.
ఇదీ చూడండి: