విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల నాలుగో మహాసభలు రెండో రోజూ ఘనంగా జరిగాయి. గిడుగు రామ్మూర్తి సాహితీ వేదిక, సురవరం ప్రతాపరెడ్డి సాహితీ సాంస్కృతిక వేదికలపై రాజకీయ, పాలనారంగ ప్రతినిధుల సదస్సు... మీగడ రామలింగేశ్వరస్వామితో సంగీత నవావధానం వంటివి ఆకట్టుకున్నాయి.
గిడుగు రామ్మూర్తి సాహితీ వేదికపై మీగడ రామలింగస్వామి నిర్వహించిన సంగీత నవావధానం శ్రోతలను ఆకట్టుకుంది. శ్రోతలు అడిగిన కంద, సీస పద్యాలను అలవోకగా కల్యాణి, హిందోళం వంటి రాగాల్లో ఆలపిస్తూ తన గానమాధుర్యాన్ని చాటుకున్నారు.
సురవరం ప్రతాపరెడ్డి సాంస్కృతిక వేదికపై సాంకేతిక తెలుగురంగ ప్రతినిధుల సదస్సు, తెలుగు భాషోద్యమ ప్రతినిధుల సదస్సులు ఏకకాలంలో నిర్వహించారు. రేపటితో ముగియనున్న మహాసభల్లో చివరి రోజున రాష్ట్రేతర ప్రతినిధుల సదస్సు, పత్రిక, ప్రసార మాధ్యమ రంగ ప్రతినిధుల సదస్సులు జరగనున్నాయి.
ఇదీ చదవండి :