ETV Bharat / state

నేడు తెదేపా రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం

author img

By

Published : Feb 11, 2020, 3:30 AM IST

వైకాపా సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలపై తెదేపా క్షేత్రస్థాయి పోరాటాలకు సిద్ధమవుతోంది. చంద్రబాబు సారథ్యంలో ఇవాళ జరిగే రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో వ్యూహాలు ఖరారు చేయనుంది. ఈ సమావేశంలో పింఛన్లు, రేషన్ కార్డుల తొలగింపు, విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపు, స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో గెలుపు వంటి అంశాలపై చర్చించనున్నారు.

tdp meeting in vijayawada against government decisions in ap
ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తెదేపా రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలే ప్రధాన అజెండాగా ఇవాళ విజయవాడలో తెదేపా రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరగనుంది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షత‌న జ‌రిగే ఈ స‌మావేశంలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మాజీ మంత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు హాజ‌రుకానున్నారు. అమ‌రావ‌తిపై ప్రభుత్వ వైఖ‌రిని ఖండిస్తూ అన్ని జిల్లాల్లో ఉద్యమాలు చేయ‌డం, స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో గెలిచేందుకు అనుస‌రించే వ్యూహాలను ఈ స‌మావేశంలో ప్రధానంగా చ‌ర్చించ‌నున్నారు. రేషన్ కార్డుల తొలగింపు, విద్యుత్, ఆర్టీసీ చార్జీల పెంపుపై ఉద్యమ కార్యాచరణ ఖరారు చేయనున్నారు.

అర్హులైన పేద‌ల పింఛన్లు, రేష‌న్ కార్డులు తొలిగించ‌డంపై ఇప్పటికే పార్టీ అధిష్ఠానం పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఆందోళ‌న‌లు చేప‌ట్టింది. ఈ ఆందోళ‌న‌లను మ‌రింత ఉద్ధృతం చేసేలా చంద్రబాబు ఈ సమావేశంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయ‌నున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో పార్టీని బ‌లోపేతం చేసే దిశగా వ్యూహాలు రచించనుంది. గ‌త ప్రభుత్వంలో ప‌ని చేసిన అధికారుల‌పై ప్రభుత్వం వ్యవ‌హ‌రిస్తున్న తీరును చ‌ర్చించే అవ‌కాశం ఉంది. 55 రోజులుగా దీక్షలు చేస్తున్న రాజధాని రైతులు, విద్యార్థుల‌పై పోలీసుల వైఖరిపైనా చ‌ర్చించ‌నున్నారు. రైతుల‌కు అండ‌గా ఒకే రాష్ట్రం-ఒకే రాజ‌ధాని నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ గళం వినిపించేలా కార్యకర్తలకు చంద్రబాబు దిశానిర్దేశం చేయ‌నున్నారు. రాజ‌ధాని రైతులకు మ‌ద్దతుగా మండ‌లిలో ఎమ్మెల్సీలు పోరాడిన తీరును అభినందిస్తూ తీర్మానం పెట్టనున్నారు.

ఇప్పటికే ఇసుక కొర‌తపై ఉద్యమం చేసిన తెలుగుదేశం...,పింఛన్లు, రేష‌న్ కార్డుల ర‌ద్దుపై ఉద్యమించి ప్రజ‌ల్లోకి బలంగా తీసుకెళ్లాలని యోచిస్తోంది.

ఇదీ చూడండి:పోలవరం నిర్మాణంపై కేంద్రం కీలక ప్రకటన

AP_VJA_03_11_TDP)_State_GENERAL_BODY_MEETING_curtain_raiser_political_special_PKG_3064466 Reporter: V.S.N. KRISHNA ( ) ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలే ప్రధాన అజెండాగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం ఇవాళ జరగనుంది. ప్రభుత్వ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌ట్టడం, రాజ‌ధాని అమ‌రావ‌తిపై ప్రభుత్వ వైఖ‌రిని ఖండిస్తూ అన్ని జిల్లాల్లో ఉద్యమాలు చేయ‌డం, స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో గెలిచేందుకు అనుస‌రించే వ్యూహాలను ఈ స‌మావేశంలో ప్రధానంగా చ‌ర్చించ‌నున్నారు. రేషన్ కార్డుల తొలగింపు, విద్యుత్, ఆర్టీసీ ఇతరత్రా చార్జీల పెంపు పై ఉద్యమ కార్యాచరణ ఖరారు చేసుకోనున్నారు.....look వాయిస్ ఓవర్ - 1: తాజా రాజ‌కీయ ప‌రిణామ‌ల దృష్ట్యా ఇవాళ విజ‌య‌వాడ‌లో నిర్వహించే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షత‌న జ‌రిగే ఈ స‌మావేశంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధాన‌ల‌ను ఎండ‌గ‌ట్టడం తో పాటు భ‌విష్యత్ కార్యచ‌ర‌ణ‌పై చ‌ర్చించ‌నున్నారు. ఈ స‌మావేశానికి ఎమ్మెల్యేలు,ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు,ఇంఛార్జ్‌లు,జిల్లా పార్టీ అధ్యక్షులు హాజ‌రుకానున్నారు. అర్హులైన పేద‌ల పెన్షన్లు, రేష‌న్ కార్డులు తొలిగించ‌డంపై ఇప్పటికే పార్టీ అధిష్టానం పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో తెలుగుదేశం ఆందోళ‌న‌లు చేప‌ట్టింది. ఈ ఆందోళ‌న‌లను మ‌రింత ఉదృతం చేయాల‌ని అధినేత చంద్రబాబు క్యాడ‌ర్‌కు దిశానిర్ధేశం చేయ‌నున్నారు. తమ ప్రభుత్వ హ‌యాంలో ఎంత‌మందికి పెన్షన్లు ఇచ్చామో వివ‌రంగా అందరికి తెలియ‌జేసి...వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఎన్ని తొలిగించారు అనే విష‌యాన్ని ప్రజ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లాల‌ని నిర్ణయించారు. పెన్షన్లు తిరిగి పునరుద్దరించేందుకు ప్రజా ఉద్యమం చేపట్టాలని తెదేపా భావిస్తోంది. మ‌రోవైపు త్వర‌లో జ‌రిగే స్థానిక సంస్థల ఎన్నిక‌ల్లో పార్టీని బ‌లోపేతం చేసే దిశగా నాయ‌కులు స‌న్నధ్దం కావాల‌ని ఈ స‌మావేశంలో చంద్రబాబు క్యాడ‌ర్ కి దిశానిర్దశం చేయనున్నారు. గ‌త ప్రభుత్వంలో ప‌ని చేసిన అధికారుల‌పై ప్రభుత్వం వ్యవ‌హ‌రిస్తున్న తీరును ఈ స‌మావేశంలో చ‌ర్చించే అవ‌కాశం ఉంది. పార్టీ కార్యక‌ర్తల‌పై జ‌రుగుతున్న దాడుల‌పై కూడా ఈ స‌మావేశంలో చ‌ర్చించ‌నున్నారు. గత 55 రోజులుగా రాజ‌ధాని రైతుల చేస్తున్న దీక్షలు...., ఉద్యమం చేస్తున్న రైతులు, విధ్యార్థుల‌పై పోలీసుల వ్యవ‌హ‌రిస్తున్న తీరుపైనా చ‌ర్చించ‌నున్నారు. ఒకే రాష్ట్రం ఒకే రాజ‌ధాని నినాదంతో తెదేపా ఇప్పటికే ముందుకు వెళ్తోంది. రైతుల‌కు అండ‌గా...రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పార్టీ గళం వినిపించాల‌ని ఈ స‌మావేశంలో అధినేత చంద్రబాబు క్యాడ‌ర్‌కు దిశానిర్థేశం చేయ‌నున్నారు. రాజ‌ధాని రైతులకు మ‌ద్దతుగా మండ‌లిలో ఎమ్మెల్సీలు పోరాడిన తీరును అభినందిస్తూ తీర్మానం పెట్టనున్నారు. ఎండ్ వాయిస్ ఓవర్-: ఇప్పటికే ఇసుక కొర‌తపై ఉద్యమం చేసిన తెలుగుదేశం..., పెన్షన్ల , రేష‌న్ కార్డుల ర‌ద్దుపై ఉద్యమించి ప్రజ‌ల్లోకి బలంగా తీసుకెళ్లాలని యోచిస్తోంది. (...ఓవర్)

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.