సీబీఐ అధికారులు చిటికె వేస్తే రాష్ట్రంలో వైకాపా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.. తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు. విజయవాడలో పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. సీఎం జగన్మోహన్రెడ్డి స్క్రిప్టునే రాష్ట్ర మంత్రులు చదువుతున్నారని ఎద్దేవా చేశారు. సన్నబియ్యం గురించి ప్రశ్నిస్తే అమాత్యులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. భవన కార్మికుల పక్షాన 70 ఏళ్ల వయసులో తమ పార్టీ అధినేత చంద్రబాబు దీక్ష చేస్తే అపహాస్యం చేస్తారా..? అంటూ ధ్వజమెత్తారు. తెదేపాకు అధికార, ప్రతిపక్షాలు కొత్తేమీ కాదని.. తమ పార్టీని స్టోర్రూంలో పెట్టడం ఎవ్వరి వల్లా కాదని అన్నారు. వైకాపా నాయకులు భాషను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. మాతృభాషను కాపాడాలని మేధావులు సూచిస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
ఇదీ చూడండి: