మూడు రాజధానుల బిల్లులను శాసనమండలిలో అడ్డుకోవడం వల్ల... ముఖ్యమంత్రి అహం దెబ్బతిని మండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆరోపించారు. మండలి రద్దును నిరసిస్తూ పార్టీ పిలుపు మేరకు తెదేపా శ్రేణులు విజయవాడలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంపై బుద్ధా ఆగ్రహం వ్యక్తం చేశారు. 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న కారణంగా పోలీసులు ర్యాలీకి అనుమతి నిరాకరించారు. దీంతో పోలీసులకు పార్టీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం ప్రతిపక్షంపై బెదిరింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు.
ఇదీ చదవండి: నందిగామలో ఐకాస 19వ రోజు రిలే నిరాహారదీక్షలు