.
అమరావతి కోసం.. ప్రాణాలైనా అర్పిస్తాం: బోండా ఉమా - save amaravathi news
విజయవాడలో బోండా ఉమామహేశ్వరరావు 'ఆంధ్రప్రదేశ్ సేవ్, సేవ్ అమరావతి' అంటూ ప్లకార్డులతో నిరసనకు దిగారు.రాష్ట్రవ్యాప్తంగా గత 15 రోజుల నుంచి రాజధానిని రక్షించాలంటూ... చంద్రబాబు పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ఎవరి స్వప్రయోజనాల కోసం రాజధానిని తరలిస్తున్నారని వైకాపా సర్కార్ను ప్రశ్నించారు. 5కోట్ల ప్రజల కలల అమరావతిని పరిరక్షించాలన్నారు. వైకాపా స్వార్థ ప్రయోజనాల కోసం రాజధానిని చంపాలనుకుంటున్నారని మండిపడ్డారు. అమరావతి కోసం చిన్నపిల్లలు సైతం ఉద్యమంలో పాల్గొంటున్నారన్నారు. రాజధాని కోసం ప్రాణాలైనా అర్పించి కాపాడుకుంటామన్నారు.
"అమరావతి కోసం ప్రాణాలైన అర్పిస్తాం": బోండా ఉమా
.
sample description