ETV Bharat / state

అసెంబ్లీ జరుగుతున్న తీరుపై గవర్నర్​కు తెదేపా ఫిర్యాదు

రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు జోక్యం చేసుకోవాలని తెదేపా శాసనసభాపక్షం...గవర్నర్‌ను కోరింది. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు లేఖ రాసింది.ప్రతిపక్షంపై దాడులుచేయండని మంత్రులు, ఎమ్మెల్యేలను....ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తుంటే సభాపతి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని లేఖలో పేర్కొంది.

tdp-complaint-to-governor-on-assembly
tdp-complaint-to-governor-on-assembly
author img

By

Published : Jan 22, 2020, 2:55 PM IST

అసెంబ్లీ జరుగుతున్న తీరుపై గవర్నర్​కు తెదేపా ఫిర్యాదు

రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు జోక్యం చేసుకోవాలని తెదేపా శాసనసభాపక్షం...గవర్నర్‌ను కోరింది. గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు లేఖ రాసింది.ప్రతిపక్షంపై దాడులుచేయండని మంత్రులు, ఎమ్మెల్యేలను....ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తుంటే సభాపతి ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారని లేఖలో పేర్కొంది. అసెంబ్లీ ప్రజాస్వామ్య పద్దతిలో నిర్వహించేలా వెంటనే తక్షణ చర్యలు చేపట్టాలని తెదేపా శాసనసభాపక్షం కోరింది. శాసనసభాపతి, అధికార పార్టీ సభ్యుల ప్రవర్తన సభలో సరిగా లేదంటూ లేఖలో ఫిర్యాదు చేసింది. సభాపతిసైతం తమను భయభ్రాంతులకు గురిచేసేవిధంగా వ్యవహరించారని ఆరోపించింది. . సొంత పార్టీ సభ్యులకు అనుకూలంగా ప్రతిపక్ష సభ్యులపట్ల వివక్ష చూపుతూ సభాపతి తీరు ఉందని తెదేపా శాసనసభాపక్షం గవర్నర్‌కు లేఖలో ఫిర్యాదు చేసింది.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.