ETV Bharat / state

గిట్టుబాటు ధర కోసం రోడ్డెక్కిన సుబాబుల్​ రైతులు - సుబాబుల్​ రైతుల నిరసన

అప్పుల ఊబిలో చిక్కుకుపోతున్న తమకు న్యాయం చేయాలంటూ సుబాబుల్​ రైతులు రోడ్డెక్కారు. రైతులకు నష్టం కలిగిస్తున్న రెండు జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

subabul farmers protest on road in nawabupeta
ఆందోళన చేస్తున్న రైతులు
author img

By

Published : Dec 16, 2019, 7:04 AM IST

గిట్టుబాటు ధర కోసం రోడెక్కిన సుబాబుల్​ రైతులు

సుబాబుల్ కర్రకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఆదివారం పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట గ్రామంలో రైతులు రోడ్డెక్కారు. సుబాబుల్ కొనుగోళ్ల తీరును నిరసిస్తూ రహదారిపై కర్రను దగ్ధం చేశారు. ప్రాంతానికో ధర నిర్ణయించే 143 జీవో, ఆర్సీ ట్రేడర్స్​కు లైసెన్సులు అనుమతించే 493 జీవోలను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అటవీ అభివృద్ధి సంస్థ పేరిట అడవుల్లో సాగుచేసి విక్రయిస్తున్న జామాయిల్ వల్ల సుబాబుల్​కు ధర లేకుండా పోయిందన్నారు. టన్ను సుబాబుల్ ధర 4200 ఉన్నప్పటికీ రైతుకు దక్కేది కేవలం 1600 నుంచి 2000 లోపు అని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరలు లేక అనేకమంది రైతులు ఏళ్ల తరబడి సాగు చేసిన కర్ర కొట్టడం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా సరైన చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

'యూపీ వాడికి తెలుగువాడు యముడిలా కనిపిస్తున్నాడా'

Intro:ap_vja_33_15_subabul_farmers_andholana_ap10047

Body:రైతుల ఆందోళన

Conclusion:సెంటర్ జగ్గయ్యపేట లింగ స్వామి. రోడ్డెక్కిన సుబాబుల్ రైతులు. రహదారిపై సుబాబుల్ కర్ర దగ్ధం. సుబాబుల్ కర్రకు గిట్టుబాటు ధర కల్పించి తమను ఆదుకోవాలని కోరుతూ ఆదివారం పెనుగంచిప్రోలు మండలం నవాబుపేట గ్రామంలో రైతులు రోడ్డెక్కారు. సుబాబుల్ కొనుగోలు ప్రభుత్వ తీరును నిరసిస్తూ రోడ్డుపై సుబాబుల్ కర్రను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ప్రాంతానికో దర నిర్ణయించే 143 జీవో , ఆర్ సి ట్రేడర్స్ కు లైసెన్సులు అనుమతించే 493 జీవోలను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో అడవుల్లో సాగుచేసే జామాయిల్ వల్ల రైతులు సాగు చేస్తున్న మార్కెట్లో ధర లేకుండా పోతుందన్నారు . టన్ను సుబాబుల్ ధర 4200 ఉన్నప్పటికీ రైతుకు దక్కేది కేవలం 1600 నుంచి 2000 లోపు అన్నారు. గిట్టుబాటు ధరలు లేక అనేకమంది రైతులు ఏళ్ల తరబడి సాగుచేసిన కర్ర కొట్టడం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నా సరేనా చర్యలు తీసుకొని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.