చదువుకు దూరంగా ఉన్న బాలబాలికలను బడి బాట పట్టించటమే 'ఆపరేషన్ ముస్కాన్' ఉద్దేశమని.. ప్రకాశం జిల్లా చీరాల రూరల్ సీఐ వై.శ్రీనిసరావు అన్నారు. వేటపాలెం రైల్వే స్టేషన్, జీడిపప్పు ఫ్యాక్టరీ ప్రాంతాల్లో రూరల్ సీఐ, ఎస్ఐ అజయ్ బాబు సిబ్బందితో తనిఖీలు నిర్వహించారు. బాల కార్మికులను చైల్డ్ హోమ్ అధికారులకు అప్పగించనున్నట్లు తెలిపారు.
విజయనగరం జిల్లాలో..
విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో 11 మంది బాల కార్మికులుగా గుర్తించామని పట్టణ ఎస్ఐ శ్రీనివాస్ రావు తెలిపారు. పేపర్ బాయ్ గా పనిచేస్తున్న బాల కార్మికులను గుర్తించి.. ప్రభుత్వ పరంగా స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న చైల్డ్ హోమ్ లో ఉచిత విద్యను అందిస్తామన్నారు.
కర్నూలు జిల్లాలో..
కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించారు. పట్టణంలో అనేక దుకాణాల్లో పని చేస్తున్న బాల కార్మికులను చాకిరీ నుంచి విముక్తి చేశారు. ఉదయం నుంచి ఆదోనిలో మొత్తం నాలుగు పోలీస్ స్టేషన్ల పరిధిలో 52 మంది బాల కార్మికులను గుర్తించామని పోలీసులు తెలిపారు.
కృష్ణా జిల్లాలో..
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన వీధి బాలల సంరక్షణకు ఆపరేషన్ ముస్కాన్ చేపట్టినట్లు నందిగామ డీఎస్పీ జీవీ.రమణమూర్తి తెలిపారు. కంచికచర్లలో బాల కార్మికులను గుర్తించి వారి తల్లితండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అవనిగడ్డలో ఆపరేషన్ ముస్కాన్ ద్వారా సబ్ డివిజన్ పరిధిలో 43 మంది బాల కార్మికులను పోలీసులు గుర్తించారు. గుడివాడ డివిజన్ పరిధిలో మొత్తం 9 మండలాల్లో 65 మంది బాల కార్మికులకు చాకిరి నుంచి విముక్తి కల్పించారు.
ఇదీ చదవండి: