తెలుగు మహాసభలో సిరివెన్నెల మాట్లాడారు. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా సిరివెన్నెల ప్రసంగాన్ని ఆలకించారు. చెవులకు వినసొంపుగా... ప్రశ్నార్థకంగా మారిన తెలుగుపై నిర్మొహమాటంగా ప్రసంగించారు.
తెలుగుభాషపై సిరివెన్నెల
మనం మాట్లాడే మాటకు అర్థం తెలుసా లేదా అనే అయోమయంలో 'ఈ'తరం ఉన్నారని సిరివెన్నెల పేర్కొన్నారు. ఆంగ్లపదాలు వాడుతూనే వాటికి నిజమైన అర్థం తెలుసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పదో తరగతి వరకూ ఆంగ్లమాధ్యమాన్ని పెట్టడాన్ని సిరివెన్నెల తప్పుపట్టారు. బంధువులతో ఎలా ఉండాలో... ఏవిధంగా తెలుస్తుందని ప్రశ్నించారు.
సినిమాలపై సిరివెన్నెల
సినిమా ప్రపంచాన్ని ప్రస్తుతం అందరం పాడు చేసుకుంటున్నాం. ఇంట్లో పిల్లలు అశ్లీల దృశ్యాలు చూస్తుంటే ఆపలేకపోతున్నాం... కానీ సినిమాలను తప్పుబడుతున్నాం. ప్రపంచంలోనే సినిమా అనేది ఇలా ఉండాలని తెలియజేసింది తెలుగు సినిమా అన్నారు. సినిమాల్లో మంచి ఉంటే ఆదరించండి చెడు ఉంటే శిక్షించండని వ్యాఖ్యానించారు. సినిమా అనేది ఒక వ్యాపారం మాత్రమే... ఏ కులానికి మతానికి సంబంధం లేదని అభివర్ణించారు.
పత్రికా భాషాపై సిరివెన్నెల వ్యాఖ్యలు
జనబాహుళ్యానికి అర్థమయ్యేరీతిలో పత్రికా భాష ఉండలన్నారు. కానీ ప్రస్తుతం పత్రికా సమాజంలో వింతైన పదాలు వాడుతూ... తెలుగు భాషపై విరక్తికలిగేలా చేస్తున్నారన్నారు. వందేళ్ల పోరాటమే పత్రికా భాష అని తెలిపారు.
ఇదీ చూడండి