విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో శ్రీపంచమి మహోత్సవాలు వైభవంగా సాగాయి. శ్రీపంచమి సందర్భంగా కనకదుర్గమ్మ.. సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సరస్వతి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు నగరంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దసరా ఉత్సవాల తర్వాత.. మళ్లీ శ్రీపంచమి రోజే కనకదుర్గమ్మ సరస్వతి దేవి అలంకారంలో దర్శనమివ్వడం ఇక్కడి ప్రత్యేకత. సరస్వతీ దేవిగా అమ్మవారిని దర్శించుకుంటే విద్యారంగంలో రాణించవచ్చనే నమ్మకంతో పెద్ద ఎత్తున విద్యార్థులు దుర్గమ్మ దర్శనం కోసం వచ్చారు. ఆలయంలోని యాగశాలలో ప్రత్యేకంగా సరస్వతి యాగం నిర్వహించారు. విద్యార్థులకు అమ్మవారి పూజలో ఉంచిన పెన్ను, కుంకుమ, కంకణాలను ప్రసాదంగా అందించారు.
ఇదీ చదవండి: