ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు నాగ సుబ్బమ్మ. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం చిన్నదండ్లూరు స్వగ్రామం. మూడు రోజుల క్రితం ఇంటి వద్ద కింద పడింది. కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. పొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఎముకలు, శస్త్రచికిత్సల విభాగంలో చికిత్స పొందుతోంది. మల, మూత్ర విసర్జనకు వెళ్లాలని తొలుత ఆసుపత్రి సిబ్బందిని చక్రాల కుర్చీ కోసం సంప్రదించారు. స్పందన లేదు. తనయుడే... తల్లి తనకు భారం కాదని మరుగుదొడ్డికి చేతులపై తీసుకొని వెళ్ళాడు. కని పెంచిన తల్లి రుణం ఇలా తీర్చుకుంటున్నానని అతను తెలిపారు.
ఇవీ చదవండి...నాన్నా... నీ జ్ఞాపకం పాఠశాలలో పదిలం..!