ఘనంగా సీతారామ స్వామి దేవస్థానం పునః ప్రతిష్ట - seetarama swamy temple reconsturction in penamaluru news
కృష్ణా జిల్లా పెనమలూరులోని శ్రీ సీతారామ స్వామి దేవస్థానం పునఃప్రతిష్ట శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పార్థసారథి పాల్గొన్నారు. హిందూ సంప్రదాయాన్ని రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేసి ప్రభుత్వానికి మచ్చ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.