కృష్ణా జిల్లా విజయవాడ పటమటలోని భారతీయ స్టేట్ బ్యాంకులో ఏర్పాటు చేసిన సంపద నిర్వహణ కేంద్రాన్ని ఆ సంస్థ డీఎండీ వెంకట నాగేశ్వర్ ప్రారంభించారు. పదిలక్షల రూపాయలకు పైబడి లావాదేవీలు నిర్వహించే వినియోగదారుల కోసం సంపద నిర్వహణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. వినియోగదారుల సొమ్ముకు భద్రత కల్పించడం సహా రెట్టింపు ఆదాయం పొందేలా బ్యాంకు సిబ్బంది తగు సలహాలిస్తారని తెలిపారు. ఇప్పటికే విశాఖపట్నం, విజయవాడలో సంపద కేంద్రాలను ప్రారంభించగా... త్వరలో నెల్లూరులో మూడో కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులకు తక్కువ రిస్కుతో.... మార్కెట్లో అందుబాటులో ఉన్న ఉత్పత్తుల గురించి వివరించి వారి సంపదను రెట్టింపు చేయడమే ఈ కేంద్రాల ఉద్దేశమని డీఎండీ తెలిపారు.
ఇదీ చూడండి: