కృష్ణాజిల్లా గంపలగూడెం మార్కెట్ యార్డ్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. తిరువూరు మండలం చింతలపాడుకు చెందిన 9 మంది మహిళా వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులకు తిరువూరు ఏరియా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం విజయవాడకు తరలించాలని వైద్యులు సూచించారు. బాధితులను పరామర్శిచటానికి వచ్చిన తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి అంబులెన్స్ సదుపాయాలను కల్పించారు.
ఇదీ చూడండి: గౌరాజుపల్లిలో ఆటో బోల్తా..11మంది కూలీలకు తీవ్రగాయాలు