ETV Bharat / state

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన.. బామ్మకు దొరికింది ఆధారం..! - ration dealer gave Commodities to alivelamma news

నా అన్న వారు ఉన్నా ఆ బామ్మ అనాథే. ఎండకు ఎండటం.. వానకు తడవటం.. చలికి వణకడం.. ఇదే ఆ బామ్మ జీవితం.  ఆకలి తీర్చుకునేందుకు గుడిలో పని చేసేది. వచ్చినవారు సాయం చేస్తే వెయ్యి రూపాయలు పోగేసి ఓ పరదా కొనుక్కుంది. కరకట్టపై గుడిసె వేసుకుంది. కనీసం తిండి లేక.. ఆమె అనుభవిస్తున్న పేదరికంపై ఈటీవీ భారత్ కథనానికి అధికారులు స్పందించారు. ఆమెకు రేషన్​ అందేలా చర్యలు చేపట్టారు.

హమ్మయ్యా.. బామ్మకు రేషన్ సరకులు అందాయి!
హమ్మయ్యా.. బామ్మకు రేషన్ సరకులు అందాయి!
author img

By

Published : Jan 8, 2020, 6:58 PM IST

Updated : Jan 8, 2020, 11:51 PM IST

హమ్మయ్యా.. బామ్మకు రేషన్ సరకులు అందాయి!

తుమ్మ అలివేలమ్మకు భర్త, పిల్లలు లేరు. బంధువులున్నా.. ఆమె దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల పెద్దగా పట్టించుకోలేదు. విజయవాడ... గోసాల గ్రామం నుంచి ఆరేళ్ల క్రితం కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం నడికుదురు గ్రామంలోని ఆలయానికి చేరుకుంది. ఆలయం పరిసర ప్రాంతాన్ని శుభ్రపరుస్తూ కాలం వెళ్లదీసేది. ఆలయానికి వచ్చిన వారు తమకు తోచిన సాయం చేసేవారు. అలా వచ్చిన వెయ్యి రూపాయలు కూడబెట్టుకుని.. నడికుదురు గ్రామం ప్రక్కన మోపిదేవి నుంచి విజయవాడ వెళ్లే కృష్ణా నది ఎడమ కరకట్టపై చిన్న పరదాతో గుడిసె వేసుకుని జీవనం సాగిస్తోంది.

కాళ్లరిగేలా తిరిగినా రేషన్​ అందలేదు

అలివేళమ్మకు ఆధార్ కార్డు ఉంది. 3 ఏళ్లుగా.. రేషన్ కార్డు కోసం కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగినా రాలేదు. వితంతు పింఛనూ అందలేదు. తినడానికి తిండి లేక ఒక్కోసారి పస్తులుండేది. ఆమె దీనగాథపై 'గుడిలో చిల్లరతో గుడిసె వేసుకున్నా... ఆధార్‌ ఆకలి బాధ తీర్చలేదు' అని ఈటీవీ భారత్ కథనం ఇచ్చింది. దీనిపై రేషన్ డీలర్ స్పందించారు.

చొరవ చూపిన ఈటీవీ భారత్​ ప్రతినిధి

ఈటీవీ భారత్ ప్రతినిధి అలివేళమ్మ ఆధార్​ నెంబర్​ ఆధారంగా ఆన్​లైన్​లో వెతికారు. రేషన్​ కార్డు నెంబరుకు ఆధార్ లింక్ అయినట్లు చూపించింది. వెంటనే ఆయన స్థానిక రేషన్ డీలర్ వద్దకు వెళ్లి.. అలివేళమ్మ రేషన్ కార్డు నెంబర్ తెలియజేశారు. ఇపోస్​ మిషన్​ ద్వారా కార్డు యాక్టివ్​లో ఉందని తెలుసుకున్న రేషన్ డీలర్ బామ్మ వేలిముద్రలు తీసుకుని నిత్యావసర సరుకులు అందజేశారు. దీనిపై అలివేళమ్మ సంతోషం వ్యక్తం చేసింది. తన ఆకలి తీరేలా సాయం చేసినందుకు ఈటీవీ భారత్​కు కృతజ్ఞతలు తెలిపింది. అలాగే అధికారులు స్పందించి పింఛను ఇప్పించాలని కోరుతోంది.

ఇదీ చదవండి:

ఆ కుటుంబాలకు సంక్రాంతి ముందే వచ్చింది...!

Intro:ap_vja_46_08_etvbharat_effect_bammaku_rationsarukulu_pkgavbap10044

కోసురు కృష్ణ మూర్తి, అవనిగడ్డ నియోజకవర్గం
సెల్.9299999511.

ఈటీవీ భారత్ కధనానికి స్పందించిన రేషన్ డీలర్

రేషన్ సరుకులు అందజేసిన డీలర్

తుమ్మ అలివేళమ్మ కు పిల్లలు లేరు, భర్త లేడు ఒంటరిగా జీవిస్తుంది, గత 6 సంవత్సరరాలుగా కరకట్ట పైనే గుడిసె వేసుకుని జీవిస్తుంది.

ఈటీవీ భారత్ యాప్ లో
ది.26-12-2019 బామ్మ కష్టాలు
గుడిలో చిల్లరతో గుడిసె వేసుకున్నా
ఆధార్ ఆకలి బాధ తీర్చలేదు కథనం ప్రసారం జరిగింది.

గత 5 సంవత్సరాలుగా రేషకార్డు కోసం అర్జీలు పెట్టి అలసిపోయింది.

ది.22-10-2018 లొనే ఆన్లైన్ లో రేషన్ కార్డు మంజూరు అయినా సంవత్సర కాలం గడుస్తున్నప్పటికి ఈరోజు వరకు కూడా ఆమెకు అందజేయని చల్లపల్లి రెవిన్యూ అధికారులు.

ఒక మహిళా తహసీల్దార్ అయిఉండి సాటి మహిళా అని కూడా కనికరం చూపని చల్లపల్లి తహసీల్దార్
పెంక్షన్ రాక ఎవ్వరు లేక వారానికి కొన్ని రోజులు పస్థులు ఉండేది తుమ్మ అలివేలమ్మ

ఈటీవీ భారత్ ప్రతినిధి ఆమె ఆధార్ నెంబరు ఆధారంగా ఆన్లైన్ లో వేతకగా రేషన్ కార్డు నెంబరుJAP063202400088 ఆధార్ కార్డుకు లింకు అయినట్లు చూపడంతో స్థానిక రేషన్ డీలర్ కి సదరు కార్డు నెంబరు తెలియజేయడంతో ఇపోస్ మిషన్ ద్వారా కార్డు ఆక్టివ్ లో ఉన్నదని ఆమె ఫింగర్ ప్రింట్ తీసుకుని 5 కేజీల బియ్యం, కేజీ పప్పు, అరకిలో పంచదార ను తుమ్మా అలివేళమ్మకు అందించారు. తనకు పెంక్షన్ కూడా ఇప్పించాలని కోరుతుంది.

గత ఆరు సంవత్సరాలుగా రేషన్ బియ్యం రాక అనేక ఇబ్బందులు పడిన తనకు రేషన్ బియ్యం, కందిపప్పు, పంచదార ఇవ్వడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఈటీవీ భారత్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఒంటరిగా ఒక్కటే ఉంటున్న మహిళకు రేషన్ సరుకులు ఇచ్చేలా చేసినందుకు ఈటీవీ కి కృతజ్ఞతలు తెలిపారు.

Body:ఈటీవీ భారత్ కధనానికి స్పందించిన రేషన్ డీలర్ ఒంటరి మహిళకు రేషన్ సరుకులు అందజేత

Conclusion:ఈటీవీ భారత్ కధనానికి స్పందించిన రేషన్ డీలర్ ఒంటరి మహిళకు రేషన్ సరుకులు అందజేత
Last Updated : Jan 8, 2020, 11:51 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.