ETV Bharat / state

25 వారాలకే పుట్టిన శిశువుకు.. అరుదైన శస్త్ర చికత్స - hospital

ఎంతో క్లిష్టమైన శస్త్ర చికిత్సను ఆంధ్ర ఆసుపత్రి వైద్య బృందం విజయవంతంగా పూర్తి చేసింది. నెలలు నిండకుండానే పుట్టిన పాపకు గుండె ఆపరేషన్ చేసి ప్రాణాలు నిలిపారు.

చిన్నారికి ప్రాణం పోసిన వైద్యులు
author img

By

Published : Apr 20, 2019, 6:06 PM IST

చిన్నారి ప్రాణాన్ని నిలిపిన వైద్యులు

నెలలు నిండకుండానే 25 వారాలకు పుట్టిన నవజాత శిశువుకు విజయవాడలోని ఆంధ్ర ఆసుపత్రి వైద్యులు విజయవంతంగా గుండె శస్త్రచికిత్స నిర్వహించారు. విజయవాడకు చెందిన అంబిక, ప్రసాద్‌ దంపతులకు జనవరి 18వ తేదీన జన్మించిన నవజాత శిశువుకి... పుట్టుకతోనే గుండె జబ్బు ఉన్నట్లుగా ఆంధ్ర ఆసుపత్రి పిల్లల వైద్యులు గుర్తించారు. శిశువు అస్వస్థతను పేటెంట్‌ డక్టస్‌ ఆర్టియోసెస్‌గా వైద్యులు గుర్తించారు. ఈ శిశువు ఊపిరితిత్తులు సరిగా ఎదగకపోవడం వల్ల వెంటిలేటర్‌ మీద ఉంచారు. 25 వారాలకే పుట్టిన ఈ బేబీకి చికిత్స చేయడం కష్టమైనా... తల్లిదండ్రుల కోరిక మీదట పుట్టిన కొన్ని రోజులకే శిశువుకు డాక్టరు దిలీప్‌, డాక్టరు విక్రం, డాక్టరు పి.వి.రామారావు వైద్య బృందం ఈ చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఆపరేషన్ అనంతరం వైద్యుల పర్యవేక్షణలో ఉన్న శిశువును నేడు డిశ్చార్జ్​ చేశారు. ఇప్పుడు శిశువు వయసు మూడు నెలలు. బరువు కిలో 800 గ్రాములుగా ఉందని ఆసుపత్రి వైద్య బృందం మీడియాకు తెలిపింది.
.

Intro:Ap_Nlr_02_20_Cm_Birthday_Kiran_Avb_C1

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నెల్లూరులో ఘనంగా జరిగాయి. నగరంలోని తెదేపా జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేసిన పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రవిచంద్ర, మేయర్ అజీజ్, తెదేపా నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డిలు హాజరయ్యారు. శ్రమకు మారుపేరుగా ఖ్యాతిగడించిన చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రవిచంద్ర అన్నారు. అభివృద్ధిని కాంక్షిస్తూ ప్రజలు ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని, మరోసారి చంద్రబాబే ముఖ్యమంత్రి అవటం ఖాయమని చెప్పారు.
బైట్: బీదా రవిచంద్ర, ఎమ్మెల్సీ, తెదేపా జిల్లా అధ్యక్షుడు నెల్లూరు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.