అవనిగడ్డలోని పేదల భూములను... ఇళ్ల స్థలాల కోసం తీసుకోవద్దని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈ దీక్షలకు జనసేన, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు మద్దతు తెలిపాయి. ఆయా పార్టీల కార్యకర్తలు... బాధితులకు సంఘీభావంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. గతంలో ప్రజలకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములను.. ఇప్పుడు పేదల ఇండ్ల స్థలాల కోసం తీసుకోవడం దారుణమన్నారు. వాటిమీదే ఆధారపడి బతుకుతున్నామని... ఇప్పుడు ఇలా చేస్తే తమ పరిస్థితి ఏంటని బాధితులు వాపోతున్నారు.
ఇదీ చదవండి: