పెన్షన్ వారోత్సవాలను శనివారం నుంచి ప్రారంభిస్తున్నట్లు విజయవాడ కార్మికశాఖ జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ రామారావు తెలిపారు. అసంఘటిత రంగ కార్మికులు, చిన్న చిన్న వ్యాపారుల మలి వయస్సులో ఉన్నవారికి ప్రధానమంత్రి సమ్ యోగి మాన్‌ధన్ పథకాన్ని ఉపయోగించుకోవాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2.5 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఉన్నారని... వారందరికీ పింఛన్ అందేలా కృషి చేయాలని కార్మిక శాఖ నిర్ణయించిందన్నారు. ఇందుకోసం నిర్వహిస్తున్న పెన్షన్ వారోత్సవాలను అందరూ విజయవంతం చేయాలని కోరారు. వారోత్సవాలకు సంబంధించి బ్రోచర్‌ను అధికారులు శుక్రవారం విడుదల చేశారు.
ఇదీ చదవండి :