కృష్ణా జిల్లా చందర్లపాడులో దారుణం జరిగింది. కట్టుకున్నవాడే...ఆమె పాలిట మృత్యువయ్యాడు. కొడవటి కల్లుకు చెందిన ప్రసాద్... రేషన్ డీలర్‌గా పని చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో తనకు పెట్టే ఆహారంలో భార్య మత్తు మందు కలిపి ఇస్తుందని... అందుకే మత్తుగా ఉంటుందనే అనుమానంతో గొడవకు దిగాడు. ఈ ఘర్షణలో ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది. కోపంతో ఆమె గొంతు నులిమి బలంగా గోడకేసి కొట్టాడు. ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి