తిరుమలలో అన్యమత ప్రచారంపై విజయవాడ భాజపా విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. పార్టీ కార్యాలయంలో ధార్మిక విభాగ అధ్యక్షుడు తూములూరి శ్రీ కృష్ణ చైతన్య అన్యమత ప్రచారంపై సమావేశం నిర్వహించారు. అన్యమత ప్రచారాలు హిందూ మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయంటూఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల వెనుక అన్యమత ప్రచారాలపై నిజ నిర్దారణ కమిటీ వేసి, దోషులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇది చూడండి: తిరుమలలో అన్యమత ప్రచారం పై భాజపా ఫైర్