దేశ ఆర్థిక వ్యవస్థ పేదరిక నిర్మూలనపై సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించారు. రక్షణ, బొగ్గు గనులు, రైల్వేను , అన్ని ప్రభుత్వ రంగాలను ప్రయివేటు రంగాలుగా మార్చేసి....ఆర్ధిక మూలలను మోదీ ధ్వంసం చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే అనిశ్చితిలో ఉందని నీతి ఆయోగ్ అయోమయంలో ఉందని తెలిపారు. దేశంలో చాలా చోట్ల విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారని.....నిరంకుశ పాలనను కేంద్రప్రభుత్వం పోషిస్తోందని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. రైతులు 33 వేల ఎకరాల భూమి ఇచ్చారని...ఇప్పుడు మూడు రాజధానుల చేయడం వెనుక అంతర్యం ఏంటని ప్రశ్నింటారు. చాలా రాష్ట్రాల్లో ఒకే రాజధాని ఉందని.... హైకోర్టులు ఇతర చోట్ల ఉన్నాయని గుర్తు చేశారు. మూడు రాజధానుల ప్రకటనను ప్రభుత్వం విరమించుకోవాలని...రాజధానిగా అమరావతి కొనసాగాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
త్వరలో ప్రవేశపెట్టే బడ్జెట్ కూడా ప్రజా వ్యతిరేకముగా ఉండనుందని...విద్య రంగానికి, ఆరోగ్యానికి ఎక్కువ కేటాయించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సీఏఏపై భాజాపా ప్రభుత్వం అబద్దాలు మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ, వామపక్షాలు కలిసి మోదీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాయని స్పష్టం చేశారు. ఫిబ్రవరిలో పెట్టబోయే సమావేశానికి అన్ని పార్టీలు రావాలని...రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.
ఇదీచూడండి.'ఈ సంక్రాంతిని ఉద్యమాలతో చేసుకుందాం'