కౌలు రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో చర్చించకపోవడాన్ని నిరసిస్తూ కృష్ణా జిల్లా విజయవాడ రైల్వేస్టేషన్ వద్ద రైతు సంఘాలు ర్యాలీ చేపట్టాయి. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున కౌలు రైతులు పాల్గొన్నారు. అనుమతి లేదని కౌలు రైతులు ధర్నాచౌక్‌కు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. వీళ్లందరూ ఒక్కసారిగా ప్రతిఘటించడం వల్ల... అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
2011 కౌలు రైతుల చట్టంలో మార్పులు చేసి... జగన్ ప్రభుత్వం తెచ్చిన నూతన కౌలు చట్టాన్ని సవరణ చేయాలని డిమాండ్ చేశాయి. పంటలు అమ్ముకోవడానికి ఈ-క్రాప్ బుకింగ్‌లో తమ పేర్లు నమోదు చేయాలని కోరారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలన్నారు. గ్రామ సభలు జరిపి భూయజమాని ప్రమేయం లేకుండా... కౌలు గుర్తింపు కార్డులు, రైతు భరోసా, పంట రుణాలు, తమకే ఇచ్చేలా చట్ట సవరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం కార్యదర్శి జమలయ్య డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: రహదారి మరమ్మతులు చేయాలని స్థానికుల ఆందోళన