ETV Bharat / state

ఆగిరిపల్లిలో లక్ష్మీనరసింహస్వామి తిరునాళ్లు ప్రారంభం - undefined

కృష్ణా జిల్లా ఆగిరిపల్లి శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి వారి తిరునాళ్లు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈనెల 25 నుంచి ఫిబ్రవరి 2వరకూ తిరునాళ్లను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు పూర్తి చేశారు.

ఆగిరిపల్లిలో లక్ష్మీనరసింహస్వామి తిరునాళ్లు ప్రారంభం
ఆగిరిపల్లిలో లక్ష్మీనరసింహస్వామి తిరునాళ్లు ప్రారంభం
author img

By

Published : Jan 27, 2020, 7:43 PM IST

ఆగిరిపల్లిలో లక్ష్మీనరసింహస్వామి తిరునాళ్లు ప్రారంభం

కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలంలో శ్రీ శోభనాచల లక్ష్మీ నరసింహ స్వామి వారి తిరునాళ్లు ప్రారంభమయ్యాయి. స్వామివారికి మాఘమాసం రథసప్తమి కల్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ ప్రధాన అర్చక స్వాములు తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వామి వారి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త సహాయంతో అనాదిగా కొనసాగుతున్న తిరునాళ్లు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈనెల 31 రాత్రి శ్రీ స్వామి వార్ల గరుడోత్సవం... వచ్చేనెల 1న శ్రీ స్వామివార్లకు, శ్రీ గోదా అమ్మవార్లకు దివ్య కల్యాణం... 2వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సాంప్రదాయబద్ధంగా స్వామివార్ల రథోత్సవం కొనసాగుతుందన్నారు. ఈనెల 25 నుంచి ఫిబ్రవరి 2వరకూ జరిగే స్వామివార్ల తిరునాళ్లకు సంబంధించి కార్యనిర్వహణ అధికారి సుబ్రమణ్యం పర్యవేక్షణలో సకల సన్నాహాలను సిద్ధం చేశారు.

ఇదీ చూడండి: ఘనంగా వేమాలశెట్టి తిరునాళ్లు: పోటెత్తిన భక్తులు

Intro:ap_vja_30_24_agiripalli_tirunala_avb_ap10122
కృష్ణాజిల్లా ఆగిరిపల్లి
ఆగిరిపల్లి శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామివారి తిరుణాల మహోత్సవాలు రేపటి నుండి ఫిబ్రవరి రెండో తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సకల సన్నాహాలు పూర్తి చేశారు
కృష్ణా జిల్లా పరిధిలోని నూజివీడు నియోజకవర్గం లో గల ఆగిరిపల్లి మండలం ఆగిరిపల్లి గ్రామం లో స్వయంగా వేంచేసియున్న శ్రీ శోభనాచల లక్ష్మీ నరసింహ స్వామి వారి తిరునాళ్ళ కార్యక్రమం ఈనెల 25వ తేదీ శనివారం నాడు ప్రారంభం కానున్నాయి ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చక స్వాములు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే స్వామివారికి మాఘమాసం రథసప్తమి కళ్యాణ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవోపేతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు దేవాదాయ ధర్మాదాయ శాఖ స్వామి వారి ఆలయ వంశపారంపర్య ధర్మకర్త సహాయముతో అనాదిగా కొనసాగుతున్న తిరుణాల మహోత్సవాలు కోలాహలంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ నెల 31వ తేదీ శుక్రవారం రాత్రి శ్రీ స్వామి వార్ల గరుడోత్సవం ఒకటో తేదీ నాడు శ్రీ స్వామివార్లకు శ్రీ గోదా అమ్మవార్లకు దివ్య కళ్యాణం ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం నాడు ఉదయం 8 గంటల నుండి సంప్రదాయబద్ధంగా స్వామివార్ల రథోత్సవం కొనసాగుతుందన్నారు స్వామివార్ల తిరునాళ్లకు సంబంధించి కార్యనిర్వహణ అధికారి సుబ్రమణ్యం పర్యవేక్షణలో సకల సన్నాహాలను సిద్ధం చేశారు
బైట్స్
శర్మ ఆలయ ప్రధాన అర్చకులు

Body:రేపటి నుంచి ఆగిరిపల్లి తిరుణాల ప్రారంభం

Conclusion:రేపటి నుంచి ఆగిరిపల్లి తిరుణాల ప్రారంభం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.