ముఖ్యమంత్రి జగన్మోహాన్రెడ్డి లాంటి గొప్ప ఆర్థికవేత్త దేశంలో మరెక్కడా ఉండరని... ఎద్దేవా చేశారు తెదేపా ఎంపీ కేశినేని నాని. సాధారణంగా దేశానికో, రాష్ట్రానికో ఆర్థిక మాంద్యం ఉంటుంది కానీ.. ఇవాళ రాష్ట్రంలోని ప్రతి కుటుంబంలోనూ ఆర్థిక మాంద్యం తీసుకువచ్చిన గొప్ప వ్యక్తి జగన్మోహాన్ రెడ్డేనని విజయవాడలో వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రభుత్వంలో రాజధాని లేని రాష్ట్రం... విభజన హామీలను ఎదుర్కొని గుజరాత్ కంటే మెరుగైన ఆర్థిక వృద్ధిని సాధించిందని గుర్తు చేశారు. గత విధానాలను కొనసాగిస్తే... ఇవాళ రాష్ట్రం 20 శాతం ఆర్థిక వృద్ధిని సాధించి ఉండేదన్నారు.
ఇదీ చూడండి: