ETV Bharat / state

కార్తికదీపం విశిష్టత తెలుసా..?

కార్తిక మాసంలో దీపానికి విశిష్టమైన స్థానం ఉంటుంది. మహిళలు ఉదయాన్నే దీపం పెట్టి దేవతారాధన చేస్తారు. అలా చేస్తే కోరిన కోర్కేలు తీరుతాయనేది నమ్మకం. మరీ ఆ కార్తిక దీపం విశిష్టత ఎంటి..? చూద్దాం.

కార్తిక దీపాలు వెలిగిస్తున్న యువతులు
author img

By

Published : Oct 30, 2019, 8:11 PM IST

న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్..
న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్...

కార్తికమాసానికి సమానమైన మాసమేదీ లేదు. సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు. వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు. గంగానది వంటి ఇతర నదేదీ లేదు.

దీపం... దైవ స్వరూపం....
కార్తికమాసం...పరమ పవిత్రం....
అనంత పుణ్యఫలం...దీపప్రజ్వలనం...

ప్రమిదలోని వత్తిని శరీరంగానూ, జ్వాలను ప్రాణంగా, నూనెను కర్మ ఫలంగానూ పండితులు చెబుతారు. కర్మఫలం అనే నూనె ఉన్నంత వరకే వత్తి అనే శరీరంలో జ్వాల అనే ప్రాణం ఉంటుందని దీని అర్థం. అంటే మనం చేసే పనిని బట్టే.. మన రాత మారుతుంది. లోకంలోని సర్వ జనులు సుఖంగా ఉండాలనేదే.. అన్ని శాస్త్రాలు, ఆచారాల మూల సిద్ధాంతం.

ప్రమిదలో వత్తి సత్వగుణానికి, నూనె తమోగుణానికి, మంట సత్వగుణానికి ప్రతీకలు. ఇవన్నీ ఒకటికొకటి సంపూర్ణంగా వ్యతిరేకమయిన గుణాలు. కానీ మూడు కలిస్తే కాంతి నిండుతుంది. ఒక మంచి వ్యక్తిగా, పూర్ణపురుషుడిగా రూపు దాల్చాలనుకునే వారు తమలోని తామస, రజోగుణాలని అణచిపెట్టుకోవాలి. సత్త్వ గుణాన్ని పెంచుకోవాలి. ఉత్తమ సాంగత్యం వల్ల ఉన్నతమైన వ్యక్తిత్వం అలవడి సత్త్వగుణం పెరుగుతుంది.

దీపాలు బయట వెలిగించడమే కాదు... హృదయాలలోనూ వెలిగించుకోవాలి. తద్వారా వ్యక్తుల జీవితాల్లో జ్ఞానదీపాలు వెలుగుతాయి. రాగద్వేషాలకు అతీతమైన స్వభావాన్ని పెంచుకుని... సాత్వికులుగా మారిన వ్యక్తులు సమాజానికీ ఆదర్శప్రాయులవుతారు. ఆరోగ్యవంతులైన ప్రజలతో... ప్రేమపూరితమైన వాతావరణంతో సమాజం కూడా అభివృద్ధి చెందుతుంది.

ఇదీ చూడండి: 'రాష్ట్రంలో భారీ వర్షాలు-అప్రమత్తంగా ఉండండి'

On Wed, Oct 30, 2019 at 1:03 PM Graphics GFX <graphics@etvbharat.com> wrote:

On Wed, Oct 30, 2019 at 12:46 PM Ebharat Telugu TG <tgdesk@etvbharat.com> wrote:
కార్తిక వైభవం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.