హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రాకేష్‌కుమార్ ఈ నెల 8న ప్రమాణం చేయనున్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహేశ్వరి ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. పాట్నా హైకోర్టులో సీనియర్ న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ రాకేష్ కుమార్‌ను ఏపీకి బదిలీ చేస్తూ కేంద్ర న్యాయశాఖ... ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 13లోగా ఆయన ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నెల 8న ఆయన బాధ్యతలు స్వీకరించాలని నిర్ణయించారు. కొత్త న్యాయమూర్తి రాకతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 15కు చేరనుంది.
ఇవీ చదవండి