పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగేలా ఉన్న జీవో నంబర్ 2430 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టు సంఘాలు విజయవాడ సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగాయి. గత ప్రభుత్వం జారీ చేసిన 938 జీవోకు స్వల్ప మార్పులు చేసి 2430 విడుదల చేశారని ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ సంఘం అధ్యక్షులు కృష్ణంరాజు అన్నారు. గతంలో జర్నలిస్టులుగా ఉండి ఈ జీవోలను వ్యతిరేకించిన వారే, ఇప్పుడు ప్రభుత్వ సలహాదారులుగా జీవోలుగా సమర్థించటం శోచనీయమన్నారు. అలాంటి వారు తమ వైఖరి మార్చుకొని జీవోలు రద్దు చేసేలా ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని కోరుతున్నామని తెలిపారు.
ఇదీ చదవండి: