రాజధాని అమరావతి పరిరక్షణ ఆందోళన కార్యక్రమాలను మరింత ఉద్ధృతం చేసేందుకు 'అమరావతి పరిరక్షణ సమితి' కీలక నిర్ణయాలు తీసుకుంది. సంక్రాంతి సందర్భంగా ఈనెల 15న ముగ్గుల పోటీల్లో అమరావతి పరిరక్షణ నినాదాన్ని మార్మోగించబోతోంది. 3 రాజధానుల ప్రతిపాదన తెరమీదకు వచ్చిన తర్వాత చనిపోయిన రైతుల ఫొటోలతో 16న నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. 17న ఐకాస యువజన విభాగం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు నిర్వహిస్తారు. రాజధాని అమరావతి కోసం ఇప్పటివరకు రూ.62.72 లక్షల నగదు విరాళంగా వివిధ వర్గాల నుంచి సమకూరిందని పరిరక్షణ సమితి పేర్కొంది. విరాళాల కోసం ప్రత్యేకంగా ఓ బ్యాంకు ఖాతాను ప్రారంభించింది. అమరావతి రాజధానిగా ఉండాలని కోరుతూ తమ నిరసన గళాన్ని తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఓ యాప్‌ను రూపొందించింది.
ఇదీ చూడండి: